1. ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ (EPF Account) ఉన్నవారు తమ జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు ఆర్థిక అవసరాలు తీర్చుకోవడానికి డబ్బులు డ్రా చేస్తూ ఉంటారు. గతంలో ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేయడం చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. ఈపీఎఫ్ క్లెయిమ్ (EPF Claim) ఫామ్ పూర్తి చేసి, ఈపీఎఫ్ కార్యాలయంలో సబ్మిట్ చేసి, డబ్బులు అకౌంట్లోకి ఎప్పుడు వస్తాయా అని ఎదురుచూడాల్సి వచ్చేది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అయితే ఆన్లైన్లో పీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు ఎలా తీసుకోవాలి (How to Withdraw Money From PF Account Online) అన్న సందేహాలు ఈపీఎఫ్ ఖాతాదారుల్లో ఉన్నాయి. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు డ్రా చేసే ముందు బ్యాలెన్స్ ఎంత ఉందో తెలుసుకోవడం అవసరం. ఈపీఎఫ్ అకౌంట్ బ్యాలెన్స్ తెలుసుకోవడానికి వేర్వేరు మార్గాలు ఉన్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. బ్యాలెన్స్ చెక్ చేసిన తర్వాత ఈపీఎఫ్ మెంబర్ పోర్టల్‌లో క్లెయిమ్‌కు దరఖాస్తు చేయొచ్చు. పీఎఫ్ క్లెయిమ్ విజయవంతం కావాలంటే మీ యూఏఎన్ నెంబర్ యాక్టివేట్ అయి ఉండాలి. యూఏఎన్ నెంబర్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి. యూఏఎన్ యాక్టివేట్ చేసినప్పుడు ఉపయోగించిన మొబైల్ నెంబర్ కూడా యాక్టీవ్‌లో ఉండాలి. ఈపీఎఫ్ క్లెయిమ్ కోసం ఈ స్టెప్స్ ఫాలో అవండి. (ప్రతీకాత్మక చిత్రం)
5. ముందుగా ఈపీఎఫ్ఓ వెబ్సైట్ https://epfindia.gov.in/ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Online Claims పైన క్లిక్ చేయండి. లేదా నేరుగా https://unifiedportal-mem.epfindia.gov.in/ పోర్టల్ ఓపెన్ చేయొచ్చు. యూఏఎన్, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి. లాగిన్ అయిన తర్వాత సర్వీసెస్ సెక్షన్ క్లిక్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆన్లైన్ సర్వీసెస్ ట్యాబ్ ఓపెన్ చేయాలి. క్లెయిమ్ ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత స్క్రీన్‌లో బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఎంటర్ చేసి వెరిఫై చేయాలి. ఆ తర్వాత ఆన్లైన్ క్లెయిమ్ పైన క్లిక్ చేయాలి. PF Advance (Form 31) సెలెక్ట్ చేసి కారణాన్ని వివరించాలి. ఆ తర్వాత క్లెయిమ్ ఫామ్ సబ్మిట్ చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)