1. స్టాక్ మార్కెట్ వృద్ధి బాటలో సాగుతుండటం ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO)కు ఆకర్షణీయమైన లాభాలు తెచ్చిపెట్టింది. విడతలవారీగా EPFO రూ.1.23 లక్షల కోట్లను స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టింది. దీనిపై 14.6 శాతం లెక్కన వార్షిక రాబడిని సంస్థ అందుకుంది. సంస్థలో సభ్యులుగా ఉన్న 6 కోట్ల మంది వేతన జీవులకు ఇది సంతోషం కలిగించే పరిణామం. (ప్రతీకాత్మక చిత్రం)
2. కానీ భారత్ 22, సెంట్రల్ పబ్లిక్ ఎంటర్ప్రైజ్ సెక్టార్ (CPSE) ఎక్స్ఛేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ETF)పై వచ్చిన రాబడి దయనీయంగా ఉంది. ప్రభుత్వ రంగ సంస్థల నుంచి పెట్టుబడుల ఉపసంహరణ లక్ష్యంలో భాగంగా భారత్ 22ను ప్రభుత్వం రూపొందించింది. భారత్ 22లో పెట్టిన పెట్టుబడులపై మార్చితో ముగిసిన సంవత్సరానికి EPFO కేవలం 2.1 శాతం వార్షిక రాబడిని మాత్రమే అందుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. అంతే కాదు CPSE ETFలపై పెట్టిన పెట్టుబడులపై మార్చి 2021తో ముగిసిన ఆర్థిక సంవత్సరానికి నష్టం (-1.7 శాతం) చవిచూసింది. మెరుగైన రాబడిని అందుకుంటే వడ్డీ చెల్లించే సామర్థ్యం EPFOకు పెరుగుతుందని నిపుణులు అంటున్నారు. అదే సమయంలో నష్టాలను పూడ్చుకునేందుకు కొన్ని ETFలను వదిలించుకుంటే మంచిదనే సూచన వారి నుంచి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. EPFO పెట్టుబడులను SBI మ్యూచువల్, UTI మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తాయి. కేవలం ETFల ద్వారా మాత్రమే EPFO స్టాక్మార్కెట్లో పెట్టుబడులు పెడుతుంది. EPFOకు చెందిన నిధులను ETFలలో పెట్టుబడిగా పెట్టడం ద్వారా సంస్థకు మార్చి 31, 2021 నాటికి 15.76 రాబడి వచ్చేలా SBI మ్యూచువల్ ఫండ్ సంస్థ చూసింది. UTI మ్యూచువల్ ఫండ్ నిర్వహించిన నిధులపై మరింత మెరుగైన వార్షిక రాబడి అంటే 16.37 శాతాన్ని EPFO అందుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. CPSE ETF, భారత్ 22 ETFలు అన్నవి ప్రభుత్వ లక్ష్యాలు సాధించేందుకు ఉద్దేశించినవి తప్ప EPFO, దాని చందాదారుల లక్ష్యాలకు అనుగుణమైనవి కావని అభిప్రాయపడ్డారు ల్యాడర్ 7 ఫైనాన్షియల్ అడ్వజరీస్ వ్యవస్థాపకులు సురేశ్ షడగోపన్. అవి ఈక్విటీ మార్కెట్‌ను పూర్తి స్థాయిలో ప్రతిబింబించవని వాటిని EPFO ఎంచుకోవడం సరైన నిర్ణయం కాదని ఆయన అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఆర్థిక సంవత్సరం 2021 చివరి నాటికి నికరంగా రూ.122,986.4 కోట్లు (దాదాపు 1.23 లక్షల కోట్లు) పై 14.67 శాతం వార్షిక రాబడిని EPFO సంస్థ అందుకుంది. ఈ వివరాలన్ని నవంబర్ 20న జరిగే EPFO సెంట్రల్ బోర్డు సమావేశం ముందుంచుతారని తెలుస్తోంది. 2021 ఆర్థిక సంవత్సరం చివరి నాటికి EPFOకు చెందిన నిధుల్లో రూ.86,577.51 కోట్లను SBI మ్యూచువల్ ఫండ్ నిర్వహిస్తుండగా, UTI మ్యూచువల్ ఫండ్ రూ.26,401.33 కోట్ల మొత్తాన్ని నిర్వహిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. మార్చి 31, 2021 నాటికి EPFO సంస్థ CPSE ETFలు, భారత్ 22 ETFలలో రూ.10, 007 కోట్లు పెట్టుబడిగా పెట్టింది. మార్చి తర్వాత స్టాక్ మార్కెట్ గణనీయంగా పెరగడంతో EPFO పెట్టిన ఈక్విటీ పెట్టుబడులపై రాబడి కూడా బాగా పెరిగి ఉంటుంది. మార్చి 31న BSE సెన్సెక్స్ S&P 49,509.15గా ఉండగా నవంబర్ 16నాటికి ఇది 60,322.37కు పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఇండీస్లలో పెట్టుబడి పెట్టినప్పుడు సెక్టోరల్ పెట్టుబడులకు దూరంగా ఉంటే బాగుండేదని మెర్సర్కు చెందిన బిజినెస్ లీడర్ అమిత్ గోపాల్ సూచించారు. అయితే దీర్ఘకాలంలో PSU స్టాక్స్ మెరుగైన రాబడి ఇస్తాయని అన్నారు. మంచి రాబడి, విస్తృత ఎక్స్పోజర్ కోసం EPFO తన పెట్టుబడుల్లోకి నిఫ్టీ నెక్ట్స్ 50 లేదా BSE 100 ఇండైసెస్లను ఎంచుకునే ఉంటే బెటరని అన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)