2. ఈఎంఐలు గతంలోలాగానే చెల్లించాలి. అయితే రీపేమెంట్ పద్ధతి ఎలా ఉంటుందన్న సందేహాలు రుణగ్రహీతల్లో ఉన్నాయి. మారటోరియం ఎంచుకున్న రోజులు కస్టమర్లు రుణాలు చెల్లించలేదు. వాటిని తప్పనిసరిగా తిరిగి చెల్లించాలి. తిరిగి చెల్లించడానికి నాలుగు ఆప్షన్స్ ఉంటాయి. ఆ ఆప్షన్స్ ఎలా పనిచేస్తాయో, వాటిలో ఏది ఎంచుకుంటే మంచిదో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఉదాహరణకు ఓ వ్యక్తి 20 ఏళ్లకు 8.50 శాతం చొప్పున రూ.50 లక్షల హోమ్ లోన్ తీసుకున్నాడని అనుకుందాం. ఏప్రిల్ నుంచి ఆగస్ట్ వరకు 5 ఈఎంఐలు వాయిదా వేశాడు. నెలకు రూ.43,391 చొప్పున ఈఎంఐ చెల్లించాలి. ఐదు ఈఎంఐలు వాయిదా వేశాడు కాబట్టి రూ.43,391 x 5 = రూ.2,16,955 చెల్లించాలి. దీనికి వడ్డీ కూడా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మూడో ఆప్షన్: ఈఎంఐ మార్చకుండా లోన్ టెన్యూర్ పొడిగించమని అడగొచ్చు. అయితే ఈఎంఐ ఎంత ఉంటుంది, టెన్యూర్ ఎంత పెరుగుతుంది అన్నది లోన్ వడ్డీ రేట్లపై ఆధారపడి ఉంటుంది. పైన చెప్పిన దాని ప్రకారం చూస్తే 240 నెలలుగా ఉన్న టెన్యూర్ 270 నెలలు అవుతుంది. అంటే 5 నెలలు ఈఎంఐ వాయిదా వేయడం వల్ల 30 ఈఎంఐలు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)