* అప్పట్లో తండ్రి ఆందోళన : మస్క్ ఓవర్ వెయిట్ పై ఓసారి ఆయన తండ్రి ఎరోల్ మస్క్ (Errol Musk) ఓ టీవీ షోలో కామెంట్ చేశారు. తన కొడుకు చాలా బలంగా ఎదిగాడని, అయితే అతడి ఆహారపు అలవాట్లు సరిగ్గా లేవని ఆయన బాధపడ్డారు. మస్క్ ‘ఈటింగ్ బ్యాడ్లీ’ అంటూ మాట్లాడారు. బరువు తగ్గించుకోవడానికి అతడు డైట్ పిల్స్ వాడాల్సిన అవసరం ఉందంటూ ఆ షోలో ఆయన వెల్లడించారు.
ఇందుకు టెస్లా సీఈఓ(Tesla CEO) మస్క్ బదులిస్తూ తనకు వర్కవుట్లు చేయడం పెద్దగా ఇష్టం ఉండదని చెప్పారు. అయితే ఏది ఏమైనా ఇప్పుడు వర్కవుట్లు చేయకుండా తప్పేట్లు లేదని చెప్పుకొచ్చారు. బెటర్ బాడీ షేప్ కోసం కష్టపడాల్సిందేనని, అందుకు ఏం చేయాలనే దానిపై ఇంకేమైనా దారులు ఉన్నాయేమో కూడా చూసుకుంటున్నట్లు తెలిపారు.
* బరువు తగ్గడంపై ట్వీట్ : ఈ విషయంపై ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘మస్క్ టన్ ఆఫ్ వెయిట్ లాస్ అయ్యారు’ అంటూ కామెంట్ చేశారు. ట్విట్టర్ హెడ్ (Twitter head) ఆ కామెంట్‌కి బదులిస్తూ ‘డౌన్ 30 ఎల్బీస్ (Down 30 lbs)’ అంటూ ట్వీట్ చేశారు. 30 ఎల్బీలంటే దాదాపు 13.5 కేజీలు. ‘ఇంత త్వరగా వెయిట్ లాస్ అవడానికి మీరు ఏం చేశారు?’ అని ఓ ఫాలోవర్ ఆయనను ప్రశ్నించారు. అందుకు మస్క్ ఆసక్తికర సమాధానాన్ని ఇచ్చారు.
ఓజెంపిక్ (Ozempic), వెగోవి (Wegovy) ఇంజెక్షన్లు రెండూ క్రానిక్ వెయిట్ మేనేజ్మెంట్లో పెద్దవారికి ఉపయోగపడతాయి. గత అక్టోబరులో మస్క్ తన బరువును సెట్ చేసుకునేందుకు ఉపవాసం ఉంటున్నట్లు పేర్కొన్నారు. అయితే ఇంజెక్షన్లు తీసుకున్నట్లు నేరుగా అంగీకరించడం ఇదే మొదటిసారి. దీంతో ఇప్పుడు ఈయన వెయిట్ లాస్ సీక్రెట్లు అందరికీ తెలిసిపోయాయి.