క్షీణిస్తున్న రూపాయి విలువ అనేక రకాలుగా ప్రజలపై ప్రభావం చూపబోతోంది. గృహోపకరణాలు, వినియోగదారు ఎలక్ట్రానిక్స్ ధరలపై దీని ప్రభావం చూపనుంది. టీవీలు, వాషింగ్ మెషీన్లు, రిఫ్రిజిరేటర్ల ధరలు పెరిగే అవకాశం ఉందని మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు. మే నెలాఖరు లేదా జూన్ మొదటి వారం నుంచి ఇవి 3 నుంచి 5 శాతం పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
తయారీదారులు పెరుగుతున్న ఖర్చులను కొనుగోలుదారులపై మోపడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు. దిగుమతి చేసుకున్న విడిభాగాలు ఖరీదైనవిగా మారినందున, US డాలర్‌తో భారత రూపాయి విలువ క్షీణించడం తయారీదారుకు ఇబ్బందిగా మారిందని పరిశ్రమ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పరిశ్రమ ప్రధానంగా కీలక భాగాల దిగుమతిపై ఆధారపడి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
కరోనా కేసుల పెరుగుదల కారణంగా చైనాలోని షాంఘైలో కఠినమైన లాక్డౌన్ అమలవుతోంది. దీంతో అక్కడి పోర్టుల్లో కంటైనర్లు పెద్ద ఎత్తున నిలిచిపోయాయి. దీంతో విడిభాగాల కొరత ఏర్పడింది. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ క్షీణించడం పరిశ్రమకు మరిన్ని సమస్యలను సృష్టిస్తోందని కన్స్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయెన్సెస్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ పేర్కొంది.(ప్రతీకాత్మక చిత్రం)
ముడిసరుకు ధరలు ఇప్పటికే పెరుగుతున్నాయని, అమెరికా డాలర్ ఇప్పుడు బలపడుతుందని CEAMA ప్రెసిడెంట్ ఎరిక్ బ్రెగన్జా తెలిపారు. భారత రూపాయి విలువ నిరంతరం క్షీణిస్తోంది. అన్ని తయారీ కంపెనీలు ఇప్పుడు బాటమ్ లైన్ వైపు చూస్తున్నాయని అన్నారు. జూన్ నుంచి 3 నుంచి 5 శాతం వరకు ధరలు పెరగొచ్చని తెలిపారు.(ప్రతీకాత్మక చిత్రం)