ఈ ఎలక్ట్రిక్ టూవీలర్ బరువు కేవలం 51 కేజీలు. టైర్ సైజ్ 24*4 ఇంచులు. లైఫ్‌టైమ్ ఫ్రేమ్ వారంటీ లభిస్తోంది. లైట్ వెయిట్ బ్యాటరీ, పోర్టబుల్ బ్యాటరీ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. రిజిస్ట్రేషన్ అక్కర్లేదు. డ్రైవింగ్ లైసెన్స్ ఉండాల్సిన పని లేదు. రూ.7 నుంచి రూ.10 ఖర్చుతో 100 కిలోమీటర్లు వెళ్లొచ్చని కంపెనీ పేర్కొంటోంది. అంటే పెట్రోల్ రేటుతో పోలిస్తే.. చాలా వరకు ఆదా చేసుకోవచ్చు. అందుబాటులో ధరలో ఎలక్ట్రిక్ టూవీలర్ పొందాలని భావించే వారు ఈ వెహికల్‌ను పరిశీలించొచు. ఇంటి వద్ద నుంచి తక్కువ దూరం ప్రయాణించే వారికి ఇవి ఉపయోగపడతాయి.