Electric Cycle: ఎవరెస్ట్ కూడా ఈజీగా ఎక్కేసే సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 km వెళ్తుంది
Electric Cycle: ఎవరెస్ట్ కూడా ఈజీగా ఎక్కేసే సైకిల్.. ఒక్కసారి చార్జ్ చేస్తే 500 km వెళ్తుంది
Electric Cycles: ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరుగుతోంది. అందుబాటు ధరలో ఉండి... మంచి రేంజ్ ఇచ్చే బైక్‌లు, కార్లకు ఆదరణ పెరుగుతోంది. ఇప్పుడు కొత్త కొత్త మోడల్స్‌లో అద్భుతమైన ఎలక్ట్రిక్ సైకిళ్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. అమెరికా కంపెనీ తయారుచేసిన ఓ సైకిల్ మాత్రం బగా ఆకట్టుకుంటోంది.
ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఎలక్ట్రిక్ సైకిళ్ల రేంజ్ తక్కువగా ఉంది. తక్కువ బ్యాటరీ కెపాసిటీ ఉండడం తక్కువ దూరం మాత్రమే ప్రయాణిస్తాయి. కానీ అమెరికాకు చెందని Optbike కంపెనీ.. బైక్‌తో పోటీపడే సైకిల్‌ను తీసుకొచ్చింది. దాని విశేషాలు తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు.
2/ 6
ఈ ఎలక్ట్రిక్ సైకిల్ పేరు ఆర్22 ఎవరెస్ట్. రేంజ్ విషయంలో.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అనేక ఎలక్ట్రిక్ కార్లను కూడా అధిగమించే సత్తా దీనికి ఉంది. R22 ఎవరెస్ట్ అనేది మౌంటెయిన్ బైక్. ఇది 3,260 Wh లిథియం-అయాన్ బ్యాటరీతో ఉంది.
3/ 6
ఇందులో ఉండే లిథియం అయాన్ బ్యాటరీని సైకిల్ నుంచి తొలగించవచ్చు. దీని బరువు సుమారు 16 కిలోలు. ఏ ఇతర సైకిల్లో కూడా ఇంత సామర్థ్యంతో బ్యాటరీ లేదు. ఈ సైకిల్లో ఉన్న మరో ప్రత్యేకత ఏమిటంటే.. ఇది గరిష్టంగా 58 kmph వేగంతో ప్రయాణించగలదు.
4/ 6
ఈ సైకిల్‌ను ఒక్కసారి ఛార్జ్ చేస్తే 510 కి.మీల వరకు వెళ్లగలదని Optibike పేర్కొంది. ఇది కఠినమైన భూభాగాల్లోనూ వెళ్లేలా డిజైన్ చేశారు. కార్బన్-ఫైబర్ ఫ్రేమ్ , స్వింగ్ ఆర్మ్, లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్‌తో ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది. ఇందులో డిస్క్ బ్రేకులు కూడా ఇచ్చారు.
5/ 6
R22 ఎవరెస్ట్ బ్యాక్ లైట్ LCD స్క్రీన్‌తో వస్తుంది. ఇందులో బ్యాటరీ పర్సెంటేజ్, స్పీడ్, ట్రిప్ ఓడోమీటర్, లైఫ్ టైమ్ ఓడోమీటర్ వంటి సమాచారాన్ని చూడవచ్చు. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ ధర US$ 18,900. అంటే మన కరెన్సీలో సుమారు ₹ 15 లక్షలు.
6/ 6
ఈ సైకిళ్లలు పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులోకి వచ్చినట్లు కంపెనీ తెలిపింది. ప్రపంచంలోని ఎత్తైన పర్వతం ఎవరెస్ట్‌పై పరీక్షించినట్లయితే.. R22 ఈజీగా ఎక్కగలతని ఆప్టిక్ బైక్ కంపెనీ పేర్కొంది.