జులై నెల మన భారతీయ పేదలు, మధ్యతరగతి వారి డబ్బులు లాక్కుపోయిన నెల. జులైలో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన వివరాలు ప్రకారం... 2020తో పోల్చితే... వంట నూనెల ధరలు... 52 శాతం పెరిగాయి. అంటే ప్రజలపై తీవ్రమైన భారం పడినట్లే. కేంద్ర ఆహార, వినియోగదారుల వ్యవహారాల సహాయమంత్రి అశ్వినీ కుమార్ చౌబే... ఈ విషయాన్ని రాజ్యసభలో చెబుతూ... నిత్యవసరాల ధరలు తగ్గించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని అన్నారు.
వంట నూనెల ధరలు తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం... క్రూడ్ పామాయిల్‌పై పన్నును జూన్ 30 నుంచి 5 శాతం తగ్గించింది అని మంత్రి తెలిపారు. అలా సెప్టెంబర్ 30 వరకూ తగ్గింపు ఉంటుంది అన్నారు. ఫలితంగా పన్ను 35.75 శాతం నుంచి 30.25 శాతానికి తగ్గింది అని వివరించారు. అలాగే... రిఫైన్డ్ పామాయిల్ లేదా పామోలిన్ పై పన్నును 45 శాతం తగ్గించి... 37.5 శాతంగా ఉంచామన్నారు. మీకు తెలుసుగా... ఇండియాలో వాడుతున్న పామాయిల్లో 60 నుంచి 70 శాతం విదేశాల నుంచే దిగుమతి అవుతోంది.