సెంట్రల్ ఆర్గనైజేషన్ ఫర్ ఆయిల్ ఇండస్ట్రీ అండ్ ట్రేడ్‌కు చెందిన వ్యాపారులు మాట్లాడుతూ.. హోలి సందర్భంగా డిమాండ్ పెరినప్పటికీ ధరలు మాత్రం దిగి వచ్చాయని పేర్కొంటున్నారు. బ్రెజిట్, అర్జెంటినా, మలేసియా వంటి దేశాల్లో ఆయిల్ ఉత్పత్తి పెరిగిందని తెలియ జేస్తున్నారు. అలాగే దేశీయంగా ఆయిల్ సీడ్స్ ఉత్పత్తి పెరిగిందని తెలియజేశారు. దీని వల్ల ఆయిల్ ధరలు తగ్గాయని పేర్కొంటున్నారు.