1. ఆర్థిక మాంద్యం ప్రభావం ఈ ఏడాది తీవ్రంగా ఉంటుందని, గ్లోబల్ ఎకానమీ మూడింట ఒక వంతు మాంద్యంలో ఉంటుందని అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) చీఫ్ క్రిస్టాలినా జార్జివ్ హెచ్చరించారు. ముఖ్యంగా అమెరికా, యూరప్, చైనా ఆర్థిక వ్యవస్థలు ఇప్పటికే మందగమనంలో ఉన్నాయని, ఈ ఏడాది ఇది మరింత తీవ్రంగా ఉంటుందని జార్జివ్ అంచనా వేశారు. దీంతో ఉద్యోగుల వర్క్ విధానంపై ప్రపంచ వ్యాప్తంగా కంపెనీలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాయి అనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. దీనిపై నిపుణులు, పలు రిపోర్ట్స్ ఏం చెబుతున్నాయో ఇప్పుడు పరిశీలిద్దాం. (ప్రతీకాత్మక చిత్రం)
2. కరోనా కారణంగా హైబ్రిడ్ వర్క్ పాలసీలో రిమోట్వర్క్ ఆనవాయితీగా మారినప్పటికీ, వివిధ కంపెనీల టాప్ ఎగ్జిక్యూటివ్‌లు దీనికి వ్యతిరేకంగా ఉన్నారు. వర్క్ కల్చర్ ప్రోత్సహించడానికి ఉద్యోగులు ఆఫీస్‌లకు రావడం చాలా అవసరమని భావిస్తున్నారు. దీంతో చాలా కంపెనీలు ఫుల్ టైమ్ రిటర్న్ కోసం అవకాశం కోసం ఎదురు చూస్తున్నాయి. ఆర్థిక మాంద్యం కారణం చూపి ఉద్యోగులను ఫుల్ టైమ్ ఆఫీస్‌లకు పిలిచే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)
3. బ్లూమ్‌బెర్గ్ రిపోర్ట్ ప్రకారం.. ఆర్థిక మాంద్యం కారణంగా యుఎస్‌లో జాబ్ మార్కెట్ బలహీనపడితే, రిమోట్ వర్కింగ్ విధానంపై కంపెనీలు పునరాలోచించే అవకాశం ఉంది. అయితే Gallup ప్రకారం.. USలో 70 మిలియన్ల కంటే ఎక్కువ మంది ఉద్యోగులు రిమోట్‌గా పని చేయడానికి మొగ్గు చూపవచ్చని, వర్క్ ఫ్రమ్ హోమ్ విధానంలో పనిచేసే వారిలో 75 శాతం మంది హైబ్రిడ్ లేదా దీర్ఘకాలంలో పూర్తిగా రిమోట్‌గా వర్క్ చేయడానికి ఆసక్తి చూపే అవకాశం ఉంది. అయితే ఆర్థిక మాంద్యం కొన్ని మార్పులు తీసుకొచ్చే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఫియర్ గ్రూప్ స్థాపకుడు స్టీఫెన్ ఫియర్ మాట్లాడుతూ.. ఉద్యోగులు వారానికి కనీసం మూడు రోజులు ఆఫీసుకు తిరిగి రావాల్సిన పరిస్థితులు ఏర్పడతాయన్నారు. మాంద్యం ముంచుకు వస్తున్నందున ఉద్యోగాన్ని రక్షించుకోవడానికి ఇంటి నుంచి పని చేయడం మానుకోవాలని ఉద్యోగులకు సూచించారు. సంస్థలకు విదేశీ ఉద్యోగులను నియమించుకోవడంపై ఒక స్పష్టమైన ఆప్షన్ ఉంటుందని, దీంతో ప్రస్తుత ఉద్యోగులను తొలగించి కొత్త ఉద్యోగులను తీసుకునే అవకాశం ఉందన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ అసోసియేట్ ప్రొఫెసర్ పృథ్వీరాజ్ చౌదరి బ్లూమ్‌బెర్గ్‌తో మాట్లాడుతూ.. టాప్ పర్ఫార్మర్స్కు ఎలాంటి ఆర్థిక పరిస్థితుల్లోనైనా ఆప్షన్స్ ఉంటాయన్నారు. మాంద్యం రిమోట్ వర్క్ ట్రెండ్‌కు అనుకూలంగా ఉంటుందని, ఇది కంపెనీలకు ఆఫీస్ స్థలం, ఇతర ఖర్చులను ఆదా చేయడంలో సహాయపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. బోరోసిల్ గ్రూప్ కార్పోరేట్ హెడ్-హెచ్ఆర్ ప్రశాంత్ దేశ్‌పాండే ఫోర్బ్స్ ఇండియాతో మాట్లాడుతూ.. భారత్‌లో 54 శాతం ఉద్యోగులు హైబ్రిడ్ వర్క్ ఫ్లెక్సిబులిటీ ఇవ్వకపోతే నిష్క్రమించే ఆలోచనలో ఉన్నారన్నారు. హైబ్రిడ్ మోడల్ వర్క్ పని విధానాన్ని పూర్తిగా మార్చి వేసిందని, ఈ మహమ్మారి-ప్రేరిత మార్పు ఎక్కువ ఫ్లెక్సిబులిటీకి అవకాశం కల్పిస్తుందని తెలిపారు. ఇది ఆధునిక పని విధానమని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)