Special Trains: ప్రయాణికులకు అలర్ట్.. వైజాగ్-మహబూబ్ నగర్ మధ్య స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
Special Trains: ప్రయాణికులకు అలర్ట్.. వైజాగ్-మహబూబ్ నగర్ మధ్య స్పెషల్ ట్రైన్స్.. వివరాలివే
ఈస్ట్ కోస్ట్ రైల్వే తాజాగా కీలక ప్రకటన చేసింది. వైజాగ్-మహబూబ్ నగర్ మధ్య స్పెషల్ ట్రైన్స్ ను ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
s వేసవి నేపథ్యంలో దక్షిణ మధ్య రైల్వే ప్రయాణికుల రద్దీ దృష్ట్యా అనేక ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. తాజాగా విశాఖపట్నం-మహబూబ్ నగర్ మధ్య వీక్లీ ఎక్స్ ప్రెస్ లను ప్రవేశపెట్టింది ఈస్ట్ కోస్ట్ రైల్వే. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.
2/ 5
Train No.085085: విశాఖపట్నం-మహబూబ్ నగర్ మధ్య ఈ నెల 7వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ప్రతీ మంగళవారం ప్రత్యేక రైలును నడుపుతున్నట్లు తెలిపింది దక్షిణ మధ్య రైల్వే. ఈ ట్రైన్స్ ఆయా రోజుల్లో 19.00 గంటలకు బయలుదేరుతాయని తెలిపింది రైల్వే.
3/ 5
Train No.08586: మహబూబ్ నగర్-విశాఖ మధ్య ఈ నెల 8వ తేదీ నుంచి 29వ తేదీ వరకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది ఈస్ట్ కోస్ట్ రైల్వే.
4/ 5
ఈ రైళ్లు దువ్వాడ, అనకాపల్లె, అన్నవరం, సామర్లకోట జంక్షన్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, గుంటూరు జంక్షన్, సత్తెనపల్లె, మిర్యాలగూడ, నల్లగొండ. మౌలాలి, మల్కాజ్ గిరి, కాచిగూడ, ఉమ్దానగర్, షాద్ నగర్, జడ్చర్ల స్టేషన్లలో ఆగుతాయని అధికారులు వెల్లడించారు.
5/ 5
ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈస్ట్ కోస్ట్ రైల్వే.