EARN MONEY START THIS BUSINESS YOU CAN EARN 1 69 LAKHS PER MONTH NK
ఈ వ్యాపారం చెయ్యండి... నెలకు రూ.1.69 లక్షలు సంపాదించండి...
Power Consumption Solar Products : మన దేశంలో కరెంటు వాడకం ఎక్కువే. ఫలితంగా నానాటికీ సోలార్ ఉత్పత్తులకు డిమాండ్ పెరుగుతోంది. మీరు కొత్త వ్యాపారం ప్రారంభించదలిస్తే, సోలార్ ల్యాంప్స్ (సౌర విద్యుత్ లైట్లు) వ్యాపారం సరైనది. ఈ వ్యాపారంలో భారీ లాభాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
కేంద్ర ప్రభుత్వం సోలార్ ప్రొడక్ట్స్ వాడకాన్ని ప్రోత్సహిస్తోంది. ఇందుకోసం రుణాలు కూడా ఇప్పిస్తోంది. బ్యాంక్ నుంచీ మీరు లోన్ తీసుకోవచ్చు.
2/ 7
ఈ సోలార్ ల్యాంప్స్ వ్యాపారం ఎలా ప్రారంభించాలి, ఇందుకు ఎంత పెట్టుబడి పెట్టాలి అనేది తెలుసుకుందాం. ఇదో మంచి స్టార్టప్ అనే చెప్పాలి.
3/ 7
MSME డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ రిపోర్ట్ ప్రకారం... మొదటి నెలలో... రూ.1.5లక్షల మూలధన పెట్టుబడి అవసరం. ఈ స్థిర పెట్టుబడి (Fixed Capital)కి అదనంగా, యంత్రాల కోసం రూ.3.50 లక్షల పెట్టుబడి అవసరం.
4/ 7
అదనపు పెట్టుబడితో డ్రిల్ మెషిన్, గ్రైండర్, హై వోల్టేజ్ బ్రేక్డౌన్ టెస్టర్, ఆటో ట్రాన్స్ఫర్, ఇన్సులేషన్ టెస్టర్, టెస్టింగ్ సెటప్, డిజిటల్ మల్టీమీటర్, కంప్యూటర్, ప్రింటర్ వంటివి కొంటారు. ఇవన్నీ ఇన్స్టాల్ చెయ్యడానికి రూ.15,000 అవుతుంది.
5/ 7
రా మెటీరియల్తో 1000 సోలార్ ల్యాంపులు తయారుచెయ్యొచ్చు. ఏడాదికి 12,000 సోలార్ ల్యాంపులు తయారుచెయ్యడానికి రూ.2,43,66,000 అవుతాయి. ఎప్పటికప్పుడు అమ్మకాలతో వచ్చే డబ్బుతో మరిన్ని బల్పులు తయారుచెయ్యొచ్చు.
6/ 7
ఒక్కో ల్యాంపునూ రూ.2,200కు అమ్మితే... ఏడాదికి మీ సంపాదన రూ.2,64,00,000 అవుతుంది. అందువల్ల ఏడాదికి మీకు వచ్చే లాభం... రూ.20,34,000 అంటే నెలకు లాభం రూ.1,69,500.
7/ 7
సోలార్ ల్యాంపుల తయారీ కేంద్రాల ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ఈ వ్యాపారం కోసం ఎలాంటి సెక్యూరిటీలూ అవసరం లేకుండా రూ.20 లక్షల వరకూ లోన్ తీసుకోవచ్చు.