1. ఆన్లైన్ ఉత్పత్తులు, సర్వీసులను కొనుగోలు చేసేలా వినియోగదారులను తప్పుదోవ పట్టించేటువంటి రివ్యూలను... ఈ-కామర్స్ సైట్లలో కట్టడి చేయడంపై కేంద్రం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా అడ్వర్టైజింగ్ ప్రమాణాల మండలితో (ఏఎస్సీఐ) కలిసి ఈ-కామర్స్ కంపెనీలు, సంబంధిత వర్గాలతో వినియోగదారుల వ్యవహారాల శాఖ శుక్రవారం వర్చువల్ సమావేశం నిర్వహించనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. ముఖ్యంగా నకిలీ, తప్పుదోవ పట్టించే రివ్యూల ప్రభావాలు, అలాంటి వాటిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యల గురించి ఇందులో చర్చించనున్నారు. ఈ సమావేశంలో పాల్గొనాలంటూ ఫ్లిప్‌కార్ట్, అమెజాన్ తదితర ఈ–కామర్స్ దిగ్గజాలతో పాటు వినియోగదారుల ఫోరమ్‌లు, లాయర్లు, ఫిక్కీ, సీఐఐ వంటి పరిశ్రమ వర్గాలకు వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ లేఖలు రాశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. తాజాగా టాటా న్యూ అనేది ఒకే యాప్‌లోని అన్ని సేవలను అందించే ఒక ఈ-కామర్స్ అప్లికేషన్(Application). ఇది కాంపిటీషన్ యాంగిల్ లో లాంటి దిగ్గజ సంస్థలకు కచ్చితంగా ఒక ప్రాబ్లం అవ్వచ్చు. ప్లే స్టోర్‌లోని టాటా న్యూ యాప్ లిస్టింగ్ ప్రకారం, ఇది షాపింగ్(Shopping), డైనింగ్, ట్రావెల్ వంటి మరికొన్ని సేవలను ఆఫర్ చేస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. టాటా సంస్థ యూజర్ల కోసం తన సొంత సూపర్ యాప్‌తో ఈ-కామర్స్ మార్కెట్లో కొంత స్పేస్ క్రియేట్ చేయాలనుకుంటుంది. టాటా న్యూ అన్ని సేవలను ఒకే ఇంటర్ఫేస్లో ఆఫర్ చేస్తుంది. ఈ ఇంటర్ఫేస్లో షాపింగ్ చేయాలా, ఫ్లైట్ టికెట్ కొనాలా లేదా కిరాణా సామాగ్రిని కొనుగోలు చేయాలా అనేది నిర్ణయించుకోవచ్చు. ప్లే స్టోర్‌లోని టాటా న్యూ యాప్ డిస్క్రిప్షన్ లో ఇది అన్ని సేవలకు వన్-స్టాప్ ప్లాట్‌ఫామ్ గా రాబోతోందని పేర్కొన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఎయిర్ ఇండియా, బిగ్ బాస్కెట్ (BigBasket), ఫార్మసీ రిటైల్ 1mg, ఎలక్ట్రానిక్స్ బ్రాండ్ క్రోమా, డైరెక్ట్-టు-హోమ్ నెట్వర్క్ టాటా స్కై లేదా టాటా ప్లే వంటి ఓన్ బ్రాండ్లన్నింటికీ సపరేట్ యాప్‌లు లేకుండా ఒకే యాప్‌లో వివిధ సేవలను యాక్సెస్ చేయడానికి టాటా న్యూ యూజర్లను అనుమతిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)