Mango leaves: మామిడాకులతో వ్యాపారం.. అమెజాన్‌లో అమ్మకం.. ఒక్క ఆకు ధర ఎంతంటే..

Mango leaves: హిందువుల పండగల్లో మామిడాకులది ప్రత్యేక స్థానం. ఇంటి గుమ్మానికి మామిడాకులను మాలగా కట్టడం సంప్రదాయంగా వస్తోంది. అలాగే దేవాలయాలు, దుకాణాల ద్వారాకు కూడా మామిడి మండలతో తోరణాలు కడతారు. ఐతే పల్లెల్లో మామిడాకులు విరివిగా లభిస్తాయి. పట్టణాలు, నగరాల్లో అంత ఈజీగా దొరకవు. మార్కెట్‌కు వెళ్లి కొనాల్సిందే.