1. రెండున్నరేళ్ల క్రితం కరోనా వైరస్ మహమ్మారి విజృంభించడంతో చాలావరకు కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ (Work From Home) అవకాశాన్ని ఇచ్చాయి. వైరస్ ప్రభావం తగ్గినా ఇప్పటికీ అనేక ఆఫీసులు వర్క్ ఫ్రమ్ హోమ్ కొనసాగిస్తున్నాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ మాత్రమే కాదు, కొన్ని కంపెనీలు వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అంటే ఎక్కడి నుంచైనా పనిచేసే అవకాశాన్ని కల్పిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇప్పుడు యూకేలో వర్క్ ఫ్రమ్ పబ్ (Work From Pub) కల్చర్ ప్రారంభమైంది. అంటే ఉద్యోగులు పబ్ నుంచి పనిచేయొచ్చు అన్నమాట. ది గార్డియన్ కథనం ప్రకారం యూకేలో పబ్‌ల సంఖ్య పెరుగుతోంది. పబ్‌లకు గిరాకీ పెంచుకోవడానికి పబ్ యాజమాన్యాలు వర్క్ ఫ్రమ్ పబ్ ఆఫర్ ఇస్తున్నాయి. ఉద్యోగులను ఆకర్షిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. వర్క్ ఫ్రమ్ పబ్ కల్చర్‌తో యూకేలో పబ్‌కు వచ్చే కస్టమర్ల సంఖ్య పెరిగిపోతోంది. అటు పబ్‌ల ఆదాయం కూడా పెరుగుతోంది. ఫుల్లర్స్ చైన్‌లో ఉన్న 380 పబ్స్ వర్క్ ఎన్విరాన్మెంట్ని అందిస్తున్నాయి. అంటే ఉద్యోగులు వచ్చి తమ ఆఫీసు పని చేసుకోవడానికి వీలుగా సౌకర్యాలు ఉంటున్నాయి. ఇందుకోసం ఒకరికి రోజుకు 10 పౌండ్లు అంటే రూ.900 ఛార్జ్ చేస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)