1. బ్యాంకులు పర్సనల్ లోన్ (Personal Loan) కన్నా బంగారంపై రుణాలు ఇచ్చేందుకే ఆసక్తి చూపిస్తుంటాయి. బంగారంపై ఇచ్చే రుణాలను బ్యాంకులు సెక్యూర్డ్ లోన్‌గా పరిగణిస్తాయి. అందుకే పర్సనల్ లోన్ వడ్డీ రేట్ల కన్నా గోల్డ్ లోన్ (Gold Loan) వడ్డీ రేట్లే తక్కువగా ఉంటాయి. ప్రభుత్వ బ్యాంకులు తక్కువ వడ్డీకే పసిడి రుణాలను ఇస్తున్నాయి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఇండియన్ బ్యాంక్ లాంటి బ్యాంకులు 7 శాతం నుంచే గోల్డ్ లోన్ ఇస్తున్నాయి. మరి ఏ బ్యాంకులో ఎంత గోల్డ్ లోన్ వస్తుంది? ఫ్రాసెసింగ్ ఫీజు ఎంత? తిరిగి ఎలా చెల్లించాలి? అనే వివరాలు తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
2. State Bank of India: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు రకాల పసిడి రుణాలను అందిస్తోంది. ఎస్బీఐ పర్సనల్ గోల్డ్ లోన్, ఎస్బీఐ రియాల్టీ గోల్డ్ లోన్ పేరుతో రుణాలను ఇస్తోంది. వార్షిక వడ్డీ 7.5 శాతం. కనీసం రూ.20,000 నుంచి రూ.50,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 0.25 శాతం + జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.. 12 నెలల నుంచి 36 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Canara Bank: కెనెరా బ్యాంక్ మూడు రకాల పసిడి రుణాలను అందిస్తోంది. అగ్రికల్చరల్ గోల్డ్ లోన్, స్వర్ణ గోల్డ్ లోన్, ఎంఎస్ఎంఈ గోల్డ్ లోన్ పేరుతో రుణాలు ఇస్తున్నాయి. వార్షిక వడ్డీ 7.35 శాతం నుంచి 7.65 శాతం. కనీసం రూ.5,000 నుంచి రూ.35,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. 0.50 శాతం + జీఎస్టీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 6 నెలల నుంచి 24 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Bank of Mahararashtra: బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర మహా గోల్డ్ పేరుతో గోల్డ్ లోన్ ఇస్తోంది. వార్షిక వడ్డీ 7 శాతం. కనీసం రూ.20,000 నుంచి రూ.5,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రుణాన్ని బట్టి రూ.500 నుంచి రూ.2,000 మధ్య ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. Punjab & Sind Bank: పంజాబ్ అండ్ సింధ్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 6.80 శాతం నుంచి 7.5 శాతం మధ్య ఉంటుంది. కనీసం రూ.1,00,000 నుంచి రూ.25,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రూ.2,00,000 వరకు రుణాలకు రూ.500 ప్రాసెసింగ్ ఫీజు, అంతకన్నా ఎక్కువ రుణాలకు 0.5 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Indian Bank: ఇండియన్ బ్యాంకులో గోల్డ్ లోన్ వడ్డీ రేటు 7 శాతం. కనీసం రూ.25,000 నుంచి రూ.5,00,000 వరకు గోల్డ్ లోన్ తీసుకోవచ్చు. రూ.300 ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. 12 నెలల లోపు రుణాన్ని తిరిగి చెల్లించాలి. బ్యాంకుల్లో గోల్డ్ లోన్ తీసుకుంటే తిరిగి చెల్లించడానికి వేర్వేరు ఆప్షన్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)