1. ప్రస్తుతం ఎక్కడ చూసినా కరెంట్ కోతల (Power Cuts) గురించే చర్చ. విద్యుత్ వినియోగం పెరుగుతుండటంతో పాటు ఇతర కారణాల వల్ల విద్యుత్ కొరత ఏర్పడుతోంది. దీంతో విద్యుత్ కోతలు తప్పట్లేదు. మరి మీరు కూడా విద్యుత్ కోతల కారణంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారా? అయితే మీరు సోలార్ పవర్ యూనిట్ (Solar Power Unit) ఏర్పాటు చేసుకొని విద్యుత్ కోతలకు చెక్ చెప్పొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2. అంతేకాదు... పెరిగిపోతున్న ఎలక్ట్రిసిటీ బిల్లుల్ని (Electricity Bills) కూడా తగ్గించుకోవచ్చు. మరి సోలార్ పవర్ యూనిట్ ఎంత కెపాసిటీతో ఏర్పాటు చేయాలి? ఖర్చు ఎంతవుతుంది? సబ్సిడీ ఎంత వస్తుంది? అన్న సందేహాలు ఉండటం మామూలే. సాధారణంగా ముగ్గురు లేదా నలుగురు ఓ కుటుంబానికి ఒక కిలోవాట్ సోలార్ పవర్ సిస్టమ్ సరిపోతుందని చెబుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒకవేళ ఇంట్లో కంప్యూటర్, రిఫ్రిజిరేటర్, గీజర్, ఏసీ లాంటి అప్లయెన్సెస్ ఎక్కువగా ఉంటే ఐదు కిలోవాట్ కెపాసిటీతో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ఒక కిలోవాట్ సోలార్ యూనిట్ ఐదు యూనిట్ల పవర్ జనరేట్ చేస్తుందని అంచనా. అంటే నెలకు 150 యూనిట్ల పవర్ జనరేట్ చేస్తుంది. సాధారణంగా ఓ కుటుంబం 150 యూనిట్ల నుంచి 250 యూనిట్ల మధ్య విద్యుత్ వినియోగిస్తూ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఒక కిలోవాట్ కెపాసిటీతో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేయడానికి సుమారు రూ.1,10,000 ఖర్చవుతుందని అంచనా. సబ్సిడీతో రూ.65,000 నుంచి రూ.70,000 మధ్య ఖర్చవుతుంది. ఒకసారి రూ.70,000 ఇన్వెస్ట్ చేసి సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకుంటే నెలకు 150 యూనిట్ల వరకు విద్యుత్తును ఖర్చు లేకుండా ఉపయోగించుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇల్లు మారిన ప్రతీసారి సోలార్ పవర్ యూనిట్ తీసుకెళ్లడం సాధ్యం కాదు. కొత్తగా అద్దెకు దిగుతున్న ఇంట్లో సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసే అవకాశం లేకపోతే చిక్కులు తప్పవు. అందుకే సొంత ఇళ్లు ఉన్నవారు సోలార్ పవర్ యూనిట్ ఏర్పాటు చేసుకోవడం మంచిది. సోలార్ పవర్ సిస్టమ్ ఏర్పాటు చేసిన తర్వాత తరచూ మెయింటనెన్స్ చేయడం మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)