1. ఒకప్పుడు సిబిల్ స్కోర్ (CIBIL Scores) గురించి పెద్దగా అవగాహన ఉండేది కాదు. కానీ బ్యాంకులు ఇచ్చే రుణాలకు, క్రెడిట్ కార్డులకు (Credit Cards) సిబిల్ స్కోర్ అవసరం అన్న విషయం తెలిసినప్పటి నుంచి లావాదేవీలు జరిపేవారిలో క్రెడిట్ స్కోర్ (Credit Score) పెంచుకోవాలన్న అవగాహన పెరుగుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. రుణాలు అయినా, క్రెడిట్ కార్డ్ అయినా వేగంగా మంజూరు కావాలన్నా, తక్కువ వడ్డీకే లోన్ కావాలన్నా మంచి క్రెడిట్ స్కోర్ ఉండటం అవసరం. అయితే క్రెడిట్ స్కోర్ ఎలా పెంచుకోవాలో చాలామందికి తెలియదు. ఈ టిప్స్ పాటించడం ద్వారా క్రెడిట్ స్కోర్ నెమ్మదిగా పెంచుకోవచ్చు. మంచి క్రెడిట్ స్కోర్ ఉంటే తక్కువ వడ్డీకే రుణాలు పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఒక వ్యక్తికి ఆర్థిక క్రమశిక్షణకు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్ట్‌నే క్రెడిట్ రిపోర్ట్ అని చెప్పుకోవచ్చు. బాగా చదువుకున్న వారికి మంచి మార్కులు వచ్చినట్టు, ఆర్థిక క్రమశిక్షణ పాటించే వారికి మంచి సిబిల్ స్కోర్ ఉంటుంది. సిబిల్ స్కోర్ మూడు అంకెల నెంబర్. సిబిల్ స్కోర్ 300 నుంచి 900 మధ్య ఉంటుంది. భారతదేశంలో క్రెడిట్ బ్యూరోల్లో ఒకటైన క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో లిమిటెడ్ ఇచ్చే స్కోర్ ఇది. 750 పైన సిబిల్ స్కోర్ ఉంటే మంచిది అని చెబుతుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. అవసరం లేకపోయినా అతిగా లోన్స్ తీసుకోవద్దు. మీ ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువగా ఉండి, ఆ ఖర్చుల్ని భర్తీ చేసేందుకు అప్పులు చేస్తూ పోతే మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. ఖర్చులు పెరిగినప్పుడు ఆదాయం పెంచుకోవాలి తప్ప, రుణాలు తీసుకుంటే ఇబ్బందే. ఎక్కువగా క్రెడిట్ కార్డులు, రుణాలు ఉండటం వల్ల కూడా మీ క్రెడిట్ స్కోర్ దెబ్బతింటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. మీరు క్రెడిట్ కార్డ్ వాడుతున్నారా? అయితే బిల్లుల్ని గడువులోగా చెల్లించండి. మీరు గడువులోగా క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించలేకపోతున్నారంటే మీ ఆర్థిక పరిస్థితి బాగాలేనట్టే. లోన్ ఇన్స్టాల్మెంట్స్, ఈఎంఐలకు కూడా ఇదే వర్తిస్తుంది. లోన్ ఈఎంఐ అయినా, ఇతర ఈఎంఐలు ఉన్నా, క్రెడిట్ కార్డ్ బిల్లు చెల్లించాలన్నా గడువులోగా చెల్లించాలి. (ప్రతీకాత్మక చిత్రం)
7. అసలు మీకు ఇప్పటివరకు సిబిల్ స్కోర్ లేదంటే మీరు ఎలాంటి రుణం తీసుకోలేదని అర్థం. మీరు సిబిల్ స్కోర్ కావాలనుకుంటే లోన్ లేదా క్రెడిట్ కార్డ్ తీసుకొని, బిల్లులు, ఈఎంఐలు సకాలంలో చెల్లిస్తూ ఉండాలి. అప్పుడే మీకు క్రెడిట్ స్కోర్ జనరేట్ అవుతుంది. మీ క్రెడిట్ స్కోర్ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)