1. వచ్చిన జీతాన్ని ఎంత జాగ్రత్తగా ఖర్చు చేసినా రెండు వారాల తర్వాత పర్సు ఖాళీగా కనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏవైనా ఖర్చులు ఉంటే అప్పు చేయకతప్పదు. బంధువుల దగ్గర లేదా స్నేహితుల దగ్గర అప్పు తీసుకొని, జీతం వచ్చిన తర్వాత తిరిగి ఇచ్చేయడం మధ్యతరగతి ఉద్యోగులకు అలవాటే. మరి ఎవరూ అప్పు ఇవ్వకపోతే ఏంటీ పరిస్థితి? ఇలాంటివారిని అడ్వాన్స్ సాలరీ లోన్ (Advance Salary Loan) అదుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2. భారతదేశంలో వేతనజీవులకు లభించే షార్ట్ టర్మ్ లోన్స్ని (Short Term Loan) అడ్వాన్స్ సాలరీ లోన్ అంటారు. బ్యాంకులో మీరు పర్సనల్ లోన్ తీసుకుంటే వార్షిక వడ్డీ రేటు కింద లెక్కించి ఈఎంఐ నిర్ణయిస్తారు. కానీ అడ్వాన్స్ సాలరీ లోన్లో వడ్డీని నెలవారీగా లెక్కిస్తారు. కొన్ని సంస్థలైతే రోజువారీగా కూడా వడ్డీని లెక్కిస్తుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3. అడ్వాన్స్ సాలరీ లోన్ వడ్డీని లెక్కించే విధానం మీరు రుణం ఇచ్చే సంస్థను బట్టి మారుతూ ఉంటుంది. రుణాల నియమనిబంధనలు కూడా సంస్థలను బట్టి వేర్వేరుగా ఉంటాయి. జీతం వచ్చాక సర్దుబాటు చేయాలనుకున్నప్పుడు పర్సనల్ లోన్ తీసుకోకపోవడమే మంచిది. పర్సనల్ లోన్ తీసుకోవడానికి ప్రాసెస్ కాస్త ఎక్కువగా ఉంటుంది. అందుకే ఇలాంటి షార్ట్ టర్మ్ లోన్స్ ఆదుకుంటూ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. ప్రతీ నెలా వేతనం పొందుతున్న ఉద్యోగులు ఎవరైనా అడ్వాన్స్ సాలరీ లోన్ తీసుకోవచ్చు. క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉన్నా అడ్వాన్స్ సాలరీ లోన్ సులువుగా తీసుకోవచ్చు. చాలావరకు సంస్థలు కొన్ని గంటల్లోనే షార్ట్ టర్మ్ రుణాలను మంజూరు చేస్తుంటాయి. కానీ ఇక్కడ ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. రుణాలు ఇచ్చే సంస్థలు వేగంగా లోన్స్ మంజూరు చేస్తుండటం, రిస్క్ ఎక్కువగా తీసుకుంటూ ఉండటం వల్ల వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. అడ్వాన్స్ సాలరీ లోన్ తీసుకునేవారి వయస్సు కనీసం 23 ఏళ్లు ఉండాలి. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి ప్రాంతాల్లో ఉన్నవారికి సులువుగా లోన్స్ వస్తాయి. వేతనం రూ.40,000 పైన ఉండాలి. ఇతర నగరాలు, పట్టణాల్లో రూ.30,000 పైన వేతనం ఉన్నా షార్ట్ టర్మ్ లోన్ తీసుకోవచ్చు. వ్యాపారాలు చేసేవారు కూడా ఈ రుణాలు తీసుకోవచ్చు. అయితే వారి ఆదాయానికి సంబంధించిన ప్రూఫ్స్ చూపించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. అడ్వాన్స్ సాలరీ లోన్ తీసుకున్న తర్వాత మీరు గడువులోగా రుణం చెల్లించాలి. డబ్బులు ఉంటే కొంత ప్రీపేమెంట్ కూడా చేయొచ్చు. లేదా రుణం మొత్తం తీర్చేయొచ్చు. ప్రీపేమెంట్ చేస్తే అదనంగా ఛార్జీలు చెల్లించాల్సి రావొచ్చు. అడ్వాన్స్ సాలరీ లోన్ తీసుకున్నవారికి ఉచితంగా క్రెడిట్ ప్రొటెక్షన్, పర్సనల్ యాక్సిడెంట్ ఇన్స్యూరెన్స్ ఆఫర్ చేస్తుంటాయి బ్యాంకులు. (ప్రతీకాత్మక చిత్రం)