2. స్టాక్ మార్కెట్ (Stock Market) లాంటి రిస్క్ ఉన్న పెట్టుబడుల్లో పెట్టుబడి పెట్టలేరు. అలాంటివారికి ప్రభుత్వానికి చెందిన కొన్ని పథకాలు మంచి ఆప్షన్‌గా నిలుస్తున్నాయి. అలాంటి స్కీమ్స్‌లో పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ అకౌంట్ ఒకటి. దీన్నే మంత్లీ ఇన్కమ్ స్కీమ్ (MIS Scheme) అని కూడా పిలుస్తుంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
3. పోస్ట్ ఆఫీస్ నేషనల్ సేవింగ్స్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్ పోస్ట్ ఆఫీస్ అందిస్తున్న పథకాల్లో పాపులర్ పథకం. ప్రభుత్వం నిర్వహించే స్కీమ్ ఇది. గ్యారెంటీగా ఫిక్స్డ్ రిటర్న్స్ వస్తాయి. ఇది ట్యాక్స్ సేవింగ్ స్కీమ్ కాదు. పన్ను ఆదా చేయాలనుకుంటే ఈ స్కీమ్ ఉపయోగకరంగా ఉండదు. ఇందులో వచ్చే రిటర్న్స్‌పై పన్నులు చెల్లించాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్‌ను వ్యక్తిగతంగా లేదా జాయింట్‌గా ఓపెన్ చేయొచ్చు. జాయింట్ అకౌంట్ ముగ్గురు కలిపి ఓపెన్ చేయొచ్చు. పదేళ్ల కన్నా ఎక్కువ వయస్సు ఉన్న మైనర్ తరఫున తల్లిదండ్రులు లేదా సంరక్షకులు ఈ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. కనీసం రూ.1,000 పొదుపుతో ఎంఐఎస్ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. గరిష్టంగా సింగిల్ అకౌంట్లో రూ.4,50,000, జాయింట్ అకౌంట్లో రూ.9,00,000 జమ చేయొచ్చు. మంత్లీ ఇన్కమ్ స్కీమ్ అకౌంట్ ఓపెన్ చేసిన నెల రోజుల తర్వాత నుంచి వడ్డీ జమ అవుతుంది. మెచ్యూరిటీ వరకు వడ్డీ పొందొచ్చు. అయితే అకౌంట్ హోల్డర్ వడ్డీ తీసుకోకపోతే ఆ వడ్డీపై అదనపు వడ్డీ రాదన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. మెచ్యూరిటీ కన్నా ఒక ఏడాది ముందు వరకు అకౌంట్ క్లోజ్ చేసే అవకాశం ఉండదు. ఒకటి నుంచి మూడేళ్ల లోపు అయితే డిపాజిట్ చేసిన మొత్తంలో రెండు శాతం తగ్గిస్తారు. ఇక వడ్డీపై టీడీఎస్ ఉండదు కానీ... వడ్డీ పొందిన తర్వాత అకౌంట్ హోల్డర్ తీసుకున్న వడ్డీపై పన్ను చెల్లించాల్సి ఉంటుంది. ఈ మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో వార్షికంగా 6.6% వడ్డీ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. ఈ అకౌంట్‌కు 2020 ఏప్రిల్ 1 నుంచి ఈ వడ్డీ రేటు అమలులో ఉంది. ఈ వడ్డీని ప్రతీ నెలా పొందొచ్చు. ఉదాహరణకు ఓ వ్యక్తి రిటైర్మెంట్ ఫండ్ లేదా ఇతర ఆదాయం ద్వారా వచ్చిన రూ.4,00,000 మొత్తాన్ని మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో దాచుకుంటే ఏటా 6.6 శాతం వడ్డీ చొప్పున రూ.26400 పొందొచ్చు. ప్రతీ నెలా వడ్డీ కావాలనుకుంటే నెలకు రూ.2,200 చొప్పున లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)