1. ఒకప్పుడు అమ్మాయి పెళ్లికి ముందు నుంచే డబ్బు పొదుపు చేయాలన్న (Money Saving) ఆలోచన తల్లిదండ్రుల్లో ఉండేది. కానీ ఇప్పటి తల్లిదండ్రులు పెళ్లితో పాటు పై చదువులకు కూడా ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తున్నారు. పిల్లలు పుట్టిన దగ్గర్నుంచే పొదుపు ప్లాన్ చేస్తున్నారు. మార్కెట్లో అనేక పొదుపు పథకాలు ఉన్నాయి. అయితే ఏ స్కీమ్‌లో (Saving Schemes) పొదుపు చేస్తే ఎక్కువ రిటర్న్స్ వస్తాయని చూస్తూ ఉంటారు. (ప్రతీకాత్మక చిత్రం)
2. స్కీమ్ ఏదైనా వార్షికంగా ఎంత వడ్డీ వస్తుందో చూసుకోవాలి. ప్రభుత్వ పొదుపు పథకాల్లో 6 శాతం నుంచి 8 శాతం వరకు వడ్డీ వస్తుంది. ఎక్కువ రిటర్న్స్ కావాలంటే మ్యూచువల్ ఫండ్స్ లాంటి స్కీమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. మరి మీ అమ్మాయి పెళ్లికి, పైచదువులకు రూ.50 లక్షలు కావాలంటే ఎలా పొదుపు చేయాలో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. సిస్టమెటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ (SIP) ద్వారా పొదుపు చేస్తే మంచి రిటర్న్స్ పొందొచ్చు. ఒకేసారి భారీ మొత్తంలో ఇన్వెస్ట్ చేయలేనివారికి ఈ ప్లాన్ ఉపయోగకరంగా ఉంటుంది. మ్యూచువల్ ఫండ్స్‌లో సిప్ చేస్తే రిటర్న్స్ 12 శాతం నుంచి 15 శాతం మధ్య ఉంటాయి. 12 శాతం రిటర్న్స్ చొప్పున లెక్కేసినా ప్రతీ నెలా రూ.1,000 చొప్పున 20 ఏళ్లు పొదుపు చేస్తే రూ.20,00,000 రిటర్న్స్ పొందొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ప్రతీ నెలా రూ.500 చొప్పున 20 ఏళ్లు జమ చేసినా రూ.5 లక్షల రిటర్న్స్ వస్తాయి. సంపాదన పెరుగుతున్నకొద్దీ పొదుపు పెంచుకుంటూ పోతే రిటర్న్స్ ఎక్కువగా ఉంటాయి. మ్యూచువల్ ఫండ్ రిటర్న్స్ మీరు సెలెక్ట్ చేసే మ్యూచువల్ ఫండ్స్ పైన ఆధారపడి ఉంటుంది. మార్కెట్లో కనిపించిన ప్రతీ మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకోవడం పొరపాటే. (ప్రతీకాత్మక చిత్రం)