Rs 2000 Currency Note | మీ దగ్గర రూ.2000 నోటు ఉందా? అది ఒరిజినల్ నోటేనా? మీకు ఇలాంటి డౌట్ ఎప్పుడైనా వచ్చిందా? నకిలీ నోటును గుర్తుపట్టడం కష్టమే. అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఒరిజినల్ రూ.2000 నోటును ఎలా గుర్తించాలో తమ వెబ్సైట్లో వివరించింది. మరి ఆ 17 గుర్తులేవో తెలుసుకోండి.
1. ముందువైపు ఎడమవైపు అడ్డంగా 2000 నెంబర్ కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 18
2. దాని పక్కనే 2000 నెంబర్ కనిపించకుండా ఉంటుంది. జాగ్రత్తగా గమనిస్తే కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 18
3. రెండో గుర్తు పైన అడ్డంగా దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 18
4. కరెన్సీ నోటు మధ్యలో మహాత్మాగాంధీ చిత్రం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 18
5. మహాత్మాగాంధీ చిత్రాన్ని జాగ్రత్తగా గమనిస్తే హిందీలో భారత్, ఇంగ్లీష్‌లో India అనే పదాలు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 18
6. మహాత్మాగాంధీ చిత్రం పక్కన సెక్యూరిటీ త్రెడ్ ఉంటుంది. అందులో భారత్ అని హిందీలో, RBI, 2000 అని కనిపిస్తాయి. ఈ సెక్యూరిటీ త్రెడ్ గ్రీన్ నుంచి బ్లూ కలర్లోకి మారుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 18
7. సెక్యూరిటీ త్రెడ్ పక్కన ఆర్బీఐ గవర్నర్ సంతకం ఉంటుంది. సంతకం కింద ఆర్బీఐ ఎంబ్లమ్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 18
8. ఆ పక్కన ఖాళీగా ఉన్నట్టు కనిపిస్తుంది. కానీ అందులో మహాత్మాగాంధీ చిత్రంతో పాటు 2000 నెంబర్ వాటర్‌మార్క్‌లాగా ఉంటుంది. కాస్త వెలుతురులో పెట్టి చూస్తే ఈ గుర్తులు కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 18
9. రూ.2000 నోటులో కుడివైపు కింద కరెన్సీ నోట్ సీరియల్ నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ సైజు చిన్న నుంచి పెద్దగా ఉంటుంది. ప్రతీ నోటుకు వేర్వేరు నెంబర్లు ఉంటాయి. ఒకే నెంబర్‌తో రెండు నోట్లు ఉండవు. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 18
10. కరెన్సీ నోటు సీరియల్ నెంబర్ పైన రూపీ గుర్తు, 2000 నెంబర్‌తో ₹2000 కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 18
11. రూ.2000 నోటులో కుడివైపు కింద అశోక స్తంభం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 18
12. అంధులు కరెన్సీ నోటును గుర్తించేందుకు నల్లని లైన్స్ ఉంటాయి. ఈ లైన్స్ రెండువైపులా కనిపిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 18
13. వెనుకవైపు ఎడమవైపు కరెన్సీ నోటు ముద్రించిన సంవత్సరం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 18
14. తెల్లని స్పేస్ కింద స్వచ్ఛ్ భారత్ లోగో, నినాదం ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 18
15. లాంగ్వేజ్ ప్యానెల్ ఉంటుంది. ఇందులో తెలుగు సహా 15 భాషల్లో రెండు వేల రూపాయలు అని రాసి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 18
16. మధ్యలో మంగళ్యాన్ చిత్రం ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 18
17. ఎడమవైపు పైన దేవనాగరి లిపిలో ₹२००० అని కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 18
మహాత్మాగాంధీ కొత్త సిరీస్‌లో భాగంగా రూ.2000 నోట్లను విడుదల చేసింది ఆర్బీఐ. ఈ కరెన్సీ నోటు సైజు 66mm x 166mm సైజులో ఉంటుంది. ఇకపై మీకు ఎప్పుడైనా రూ.2000 నోటుపై అనుమానం ఉంటే ఈ 17 గుర్తులను గమనించండి. వీటితో పాటు రూ.2000 నోటులో పలు చోట్ల 2000 నెంబర్ కూడా కనిపిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)