2. పౌరులకు ఆధార్‌కు సంబంధించిన సందేహాలకు సమాధానాలు ఇచ్చేందుకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే 'ఆధార్ మిత్ర' (Aadhaar Mitra) సర్వీస్ కొత్తగా ప్రారంభించింది యూఐడీఏఐ. ఆధార్ కార్డ్ హోల్డర్స్ తమ ఆధార్‌కు సంబంధించి ఏ సమస్యలు, సందేహాలు ఉన్నా ఆధార్ మిత్ర ఛాట్‌బాట్‌లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఆధార్ ఎన్రోల్మెంట్ నెంబర్, పీవీసీ కార్డ్ ఆర్డర్ స్టేటస్, కంప్లైంట్ స్టేటస్... ఇలా అనేక సందేహాలు, ప్రశ్నలు, సమస్యలకు ఆధార్ మిత్ర సమాచారం ఇస్తుంది. ఆధార్ మిత్ర ఏఐ ఛాట్‌బాట్ ఇంగ్లీష్, హిందీ భాషల్లో అందుబాటులో ఉంది. ఈ చాట్‌బాట్ ఆధార్ కార్డ్ హోల్డర్ల ప్రశ్నలకు ప్రతిస్పందించడానికి శిక్షణ పొందిందని యూఐడీఏఐ చెబుతోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఆధార్ మిత్ర ఏఐ ఛాట్‌బాట్‌లో మీరు మీకు సమీపంలో ఉన్న ఆధార్ సెంటర్ వివరాలు తెలుసుకోవచ్చు. మీరు కొత్తగా ఆధార్ ఎన్రోల్ చేసినా, ఆధార్‌లో వివరాలు అప్డేట్ చేసినా స్టేటస్ తెలుసుకోవచ్చు. పాన్ కార్డ్ సైజ్‌లో లభించే ఆధార్ పీవీసీ కార్డ్ ఆర్డర్ చేస్తే పార్శిల్ స్టేటస్ తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ముందుగా https://www.uidai.gov.in/en/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి. కుడివైపు కింద ఆధార్ మిత్ర బాక్స్ కనిపిస్తుంది. ఆ బాక్సును క్లిక్ చేయాలి. ఆ తర్వాత GET STARTED పైన క్లిక్ చేయాలి. PVC Status, Locate PEC, E-Aadhaar, Lost Aadhaar, Aadhaar Status ఆప్షన్స్ డిఫాల్ట్‌గా కనిపిస్తాయి. ఈ ఆప్షన్స్‌లో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. లేదా మీకు ఏదైనా ప్రశ్న, సందేహం, ఫిర్యాదు ఉంటే టైప్ చేసి ఎంటర్ చేయాలి. మీకు సమాధానం రిప్లై రూపంలో వస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)