ఐటీఆర్ దాఖలు చేయడంలో ఆలస్యమైతే.. 234A ప్రకారం మొత్తం పన్నుపై నెలకు ఒక శాతం వడ్డీని అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. అయితే ఒక వ్యక్తి చెల్లించాల్సిన ట్యాక్స్ మొత్తం రూ. 1 లక్ష లోపు ఉంటే.. 234A ప్రకారం వడ్డీ నిబంధన వర్తించదు. కానీ ట్యాక్స్ మొత్తం రూ.1 లక్ష కంటే ఎక్కువగా ఉంటే.. ఐటీఆర్ దాఖలుకు గడువు ఉన్నప్పటికీ, ట్యాక్స్ చెల్లించే వరకు ప్రతి నెలా 1 శాతం చొప్పున వడ్డీ చెల్లించాలి.(ప్రతీకాత్మక చిత్రం)
సెక్షన్ 208 ప్రకారం.. ఒక వ్యక్తి సంవత్సరానికి చెల్లించాల్సిన ట్యాక్స్ రూ. 10,000 లేదా అంతకంటే ఎక్కువ ఉంటే.. వారు అడ్వాన్స్ టాక్స్ చెల్లించాల్సి ఉంటుంది. అందువల్ల ITR దాఖలు చేయడం ఆలస్యమైనా, అన్వాన్స్ ట్యాక్స్ చెల్లించడం మంచిది. లేదంటే 234B ప్రకారం వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)
నిర్ణీత గడువు లోపు ట్యాక్స్ చెల్లించకపోతే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 234F ప్రకారం రూ. 5,000 ఆలస్య రుసుము చెల్లించాలి. అయితే మొత్తం ఆదాయం రూ. 5 లక్షలకు మించకపోతే.. ఈ ఆలస్య రుసుము రూ.1,000గా ఉంటుంది. అసెస్మెంట్ ఇయర్ డిసెంబర్ 31 వరకు కూడా ట్యాక్స్ చెల్లించకపోతే.. పన్ను చెల్లింపుదారులు రెట్టింపు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.(ప్రతీకాత్మక చిత్రం)