1. ఇండియా, పాకిస్తాన్ మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్‌లో భారతదేశం అద్భుతమైన విజయాన్ని సాధించింది. విరాట్ కోహ్లీ వీరోచిత పోరాటంతో టీమ్ ఇండియా సస్పెన్స్ థ్రిల్లర్ మ్యాచ్‌లో గెలిచింది. ఆదివారం రోజు మ్యాచ్. అది కూడా దీపావళి పండుగకు ఒక రోజు ముందు. టీమిండియా ఘన విజయంతో దీపావళి ఒక రోజు ముందే వచ్చింది. (AP Photo)
2. అయితే ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్‌తో దేశంలో యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు ఆగిపోయాయి. దీపావళి పండుగ ముందు రోజు ఆదివారం రావడంతో ఆరోజు షాపింగ్ రద్దీ ఎక్కువ ఉంటుందని అంచనా వేశారు. కానీ అదే రోజు ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ కూడా ఉంది. టీ20 వాల్డ్ కప్ మ్యాచ్ కావడంతో ఆసక్తి ఇంకా పెరిగింది. (ప్రతీకాత్మక చిత్రం)
3. ఇండియా, పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ మధ్యాహ్నం 1.30 గంటలకు ప్రారంభమైంది. ఉదయం 9 గంటలకు భారత్‌పే యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యతో పోలిస్తే ఉదయం 10.30 గంటల నుంచి ఉదయం 12.30 గంటల మధ్య లావాదేవీలు 15 శాతం ఎక్కువగా ఉన్నాయి. ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ సమయం సమీపించగానే లావాదేవీలు తగ్గాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. సరిగ్గా సాయంత్రం 4.45 నుంచి 5.30 గంటల వరకు యూపీఐ లావాదేవీలు దారుణంగా పడిపోయాయి. ఉదయం 9 గంటలకు జరిగినన్ని లావాదేవీలు కూడా జరగలేదు. సాధారణంగా ఉదయం 9 గంటలతో పోలిస్తే సాయంత్రం సమయంలో లావాదేవీలు ఎక్కువగా ఉంటాయి. కానీ థ్రిల్లింగ్ మ్యాచ్ కారణంగా ఉదయం 9 గంటలతో పోలిస్తే 20 శాతం లావాదేవీలు పడిపోయాయి. (AP Photo)
7. మ్యాచ్ పూర్తైన తర్వాత మళ్లీ యూపీఐ లావాదేవీలు పుంజుకోవడం మొదలైంది. ఆదివారం సాయంత్రం 6 గంటలకు లావాదేవీల సంఖ్య పెరిగింది. మ్యాచ్ రసవత్తరంగా మారుతున్నకొద్దీ ఆన్లైన్ షాపింగ్ నిలిచిపోయిందని, మ్యాచ్ పూర్తైన తర్వాత అంతే వేగంగా లావాదేవీల సంఖ్య పెరిగిందని మ్యాక్స్ లైఫ్ చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ మిహిర్ వోరా ట్వీట్ చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)