1. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం దీపావళి గిఫ్ట్ ఇచ్చే ఆలోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం ద్వారా పెట్రోల్, డీజిల్ ధరల్ని తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నట్టు తెలస్తోంది. సాధారణంగా దీపావళి పండుగ సీజన్లో వాహనాల అమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఈ కీలక నిర్ణయం తీసుకుంటే వాహనాల అమ్మకాలు పెరుగుతాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. ఇటీవల కాలంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి. ప్రస్తుతం హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ ధర రూ.110.09 కాగా, లీటర్ డీజిల్ ధర రూ.103.18. ఈ ఏడాది జనవరిలో రూ.80 లోపు ఉన్న పెట్రోల్, డీజిల్ ధరలు ఇప్పుడు సెంచరీ దాటేశాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఆకాశాన్ని తాకుతుండటంతో సామాన్యుల నుంచి వ్యతిరేకత వస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. కేంద్ర ప్రభుత్వం కనీసం రూ.2 ఎక్సైజ్ డ్యూటీ తగ్గించినా కేంద్ర ప్రభుత్వంపై రూ.25,000 కోట్ల భారం పడుతుంది. అంతకన్నా ఎక్కువ ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే కేంద్ర ప్రభుత్వంపై ఆర్థిక సంవత్సరంలో రూ.36,000 కోట్ల భారం పడుతుందని అంచనా. అయితే ఆర్థిక సంవత్సరం ఇప్పటికే సగం ముగిసిపోయింది కాబట్టి ఆ భారం కాస్త తగ్గొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
5. కేంద్ర ప్రభుత్వం రూ.3 ఎక్సైజ్ డ్యూటీ తగ్గిస్తే రీటైల్ ధరలు బాగా తగ్గుతాయి. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించడం మాత్రమే కాదు... రాష్ట్ర ప్రభుత్వాలు వ్యాట్ తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం అడిగే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరుణిస్తే పెట్రోల్, డీజిల్ ధరలు రూ.100 కన్నా దిగువకు చేరుకుంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఎంతైనా ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకునే అవకాశం కేంద్ర ప్రభుత్వానికి ఉంది. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్పై పన్నుల ద్వారా రాబట్టాలనుకున్న ఆదాయ లక్ష్యాన్ని పరిగణలోకి తీసుకుంటే రూ.8.5 వరకు ఎక్సైజ్ డ్యూటీ తగ్గించుకునే అవకాశం ఉందని గతంలో ఐసీఐసీఐ సెక్యూరిటీస్ నివేదిక తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
9. ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్-IOCL వెబ్సైట్లోని సమాచారం ప్రకారం లీటర్ పెట్రోల్ ధర బ్రేకప్ చూస్తే 2021 అక్టోబర్ 16న ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.49. అందులో బేస్ ప్రైస్ రూ.44.06, రవాణా ఖర్చు 31 పైసలు, ఎక్సైజ్ డ్యూటీ రూ.32.90, డీలర్ కమిషన్ రూ.3.88, వ్యాట్ రూ.24.34 లెక్కన ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)