Hyundai Offers | కారు కొనాలని అనుకుంటున్నారా? మీకు గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? పండుగ సీజన్లో కార్లపై భారీ తగ్గింపు (Festive Offers) ఆఫర్లు లభిస్తున్నాయి. కళ్లుచెదిరే డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. పలు రకాల కంపెనీలు ఇప్పటికే కార్లపై అదిరిపోయే డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటించాయి. ఇప్పుడు మరో కంపెనీ కూడా ఇదే జాబితాలోకి వచ్చి చేరింది.
ప్రముఖ కార్ల తయారీ కంపెనీల్లో ఒకటైన హ్యుందాయ్ (Hyundai Motor India) తాజాగా అదిరిపోయే ఆఫర్లు అందుబాటులో ఉంచింది. భారీ డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిచింది. ఎంపిక చేసిన మోడళ్లపై కళ్లుచెదిరే డీల్స్ అందిస్తోంది. అక్టోబర్ నెల చివరి వరకు ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. దీపావళికి కారు కొనాలని భావించే వారికి ఇది మంచి ఛాన్స్ అని చెప్పుకోవచ్చు.
కోన ఎలక్ట్రిక్ కారుపై రూ.లక్ష క్యాష్ డిస్కౌంట్ లభిస్తోంది. ఈ కారు ధర రూ. 23.84 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది. హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 నియోస్ మోడల్‌పై అయితే రూ. 48 వేల తగ్గింపు ప్రయోజనాలు లభిస్తున్నాయి. క్యాష్ డిస్కౌంట్ రూ. 35 వేల వరకు, ఎక్స్చేంజ్ బోనస్ రూ. 10 వేల వరకు, కార్పొరేట్ డిస్కౌంట్ రూ.3 వేల వరకు ఉంది. దీని ధర రూ. 5.43 లక్షల నుంచి ప్రారంభం అవుతోంది.