Car Offers: ఈ 12 కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2.5 లక్షల వరకు తగ్గింపు!
Car Offers: ఈ 12 కార్లపై భారీ డిస్కౌంట్లు.. రూ.2.5 లక్షల వరకు తగ్గింపు!
Car Discount | మీరు కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. మీకోసం భారీ తగ్గింపు ఆఫర్లు లభిస్తున్నాయి. రూ.లక్షల్లో డిస్కౌంట్ పొందొచ్చు.
December Car Offers | మీరు కొత్తగా కారు కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకోసం భారీ తగ్గింపు ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. డిసెంబర్ నెలలో పలు కంపెనీలు వివిధ మోడళ్లపై అదిరే ఆఫర్లు అందుబాటులో ఉంచాయి. మారుతీ సుజుకీ నుంచి టాటా మోటార్స్ వరకు పలు కంపెనీల కార్లపై డిస్కౌంట్లు పొందొచ్చు.
2/ 11
జీప్ మెరిడియన్ కారుపై ఏకంగా రూ. 2.5 లక్షల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. ప్రీమియం ఫీచర్లతో అదిరే కార్లు కొనుగోలు చేయాలని భావిస్తే.. ఈ కారును పరిశీలించొచ్చు.
3/ 11
జీప్ కంపాస్ కారుపై కూడా కళ్లుచెదిరే ఆఫర్లు ఉన్నాయి. రూ. 1.5 లక్షల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. క్యాష్ డిస్కౌంట్, లాయల్టీ బోనస్, ఎక్స్చేంజ్ బోనస్, కార్పొరేట్ ఆఫర్లు వంటివి అన్నీ కలిసి ఉన్నాయి. ఈ కారు రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది.
4/ 11
స్కోడా కుషక్ కారుపై సూపర్ ఆఫర్లు ఉన్నాయి. హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్ వంటి మోడళ్లకు ఈ కారును పోటీగా భావిస్తారు. ఇది 1.0 లీటర్ పెట్రోల్, 1.5 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో ఇది లభిస్తుంది. ఈ కారుపై రూ. 1.25 లక్షల వరకు తగ్గింపు పొందొచ్చు.
5/ 11
ఫోక్స్‌వ్యాగన్ తైగూన్ కారుపై కూడా భారీ ఆఫర్ ఉంది. కంపెనీకి చెందిన తొలి ఎస్యూవీ ఇది. ఈ కారుపై రూ. లక్ష వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. ఈ కారు పలు రకాల వేరియంట్ల రూపంలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
6/ 11
టాటా సఫారి, హరియర్ కార్లపై కూడా డిస్కౌంట్లు ఉన్నాయి. గరిష్టంగా రూ. లక్ష వరకు తగ్గింపు ప్రయోజనాలు పొందొచ్చు. ఈ ఎస్‌యూవీల్లో 2 లీటర్ ఇంజిన్ ఉంటుంది. కొత్త ఏడాదిలో ఈ రెండు మోడళ్లలో కొత్త వేరియంట్లు అందుబాటులోకి రానున్నాయి.
7/ 11
మహీంద్రా ఎక్స్‌యూవీ 300 మోడల్‌పై కడా డిస్కౌంట్ పొందొచ్చు. రూ. 75 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. ఈ కారు మూడు ఇంజిన్ ఆప్షన్లలో కస్టమర్లకు అందుబాటులో ఉంది.
8/ 11
నిస్సాన్ కిక్స్ మోడల్‌పై కూడా సూపర్ ఆఫర్లు ఉన్నాయి. ఈ మోడల్ రెండు పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. ఈ కారుపై రూ. 70 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. కంపెనీ ఈ కారును త్వరలో మార్కెట్ నుంచి డిస్కంటిన్యూ చేయొచ్చనే అంచనాలు ఉన్నాయి.
9/ 11
హోండా డబ్ల్యూఆర్ వీ కారు కూడా రెండు ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తోంది. కంపెనీ నుంచి లభిస్తున్న ఒకే ఒక్క ఎస్యూవీ ఇది. ఈ కారుపై రూ. 75 వేల వరకు తగ్గింపు ఉంది. హోండా సిటీ 5వ జనరేషన్ కారుపై రూ. 75 వేల వరకు తగ్గింపు లభిస్తోంది.
10/ 11
మారుతీ సుజుకీ ఎస్ప్రెసో కారుపై కూడా ఆఫర్లు ఉన్నాయి. ఈ కారుపై కూడా రూ. 75 వేల వరకు తగ్గింపు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ కారు 1.0 లీటర్ పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్లో లభిస్తోంది. ఇంకా మారుతీ సుజుకీ సెలెరియో కారుపై ఆఫర్లు ఉన్నాయి. రూ. 75 వేల వరకు బెనిఫిట్ పొందొచ్చు.
11/ 11
ఇంకా గ్రాండ్ ఐ10 నియోస్ టర్బో కారుపై కూడా డిస్కౌంట్ ఉంది. ఈ కారుపై రూ.లక్ష వరకు డిస్కౌంట్ పొందొచ్చు. ఇది 1.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్ రూపంలో లభిస్తోంది. పవర్ ఫుల్ హ్యాచ్ బ్యాక్ కార్లలో ఇది కూడా ఒకటి.