మరోవైపు కవాసకి జెడ్ 650 బైక్‌పై ఆఫర్ ఉంది. దీనిపై రూ. 35 వేల వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ బైక్‌లో 649 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ ఉంటుంది. ఆరు గేర్లు ఉంటాయి. ఇందులో యాంటి లాకింగ్ బ్రేకింగ్ సిస్టమ్, ఫ్రంట్ అండ్ డియర్ డిస్క్ బ్రేక్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ బైక్ బరువు 191 కేజీలు. 15 లీటర్ల పెట్రోల్ కొట్టించొచ్చు. దీని ఎక్స్‌షోరూమ్ రేటు రూ. 6.43 లక్షలు.
ఇంకా కవాసకి నింజా 300 బైక్ కూడా ఉంది. దీనిపై రూ.10 వేల వరకు తగ్గింపు ఉంది. ఈ బైక్‌లో 296 సీసీ పారలల్ ట్విన్ లిక్విడ్ కూల్డ్ 4 స్ట్రోక్ ఫ్యూయెల్ ఇంజెక్టెడ్ ఇంజిన్ ఉంటుంది. ఇందులో కూడా ఆరు గేర్లు ఉంటాయి. సెమీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ఉంది. పెటల్ బ్రేక్స్ డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్ ఉంటుంది. అందువల్ల ఆఫర్ పొందాలని భావించే వారు వెంటనే ఈ బైక్స్‌లో నచ్చిన దాన్ని ఎంచుకోవచ్చు.