DIGITAL LENDING PLATFORM CASHE ANNOUNCED UP TO RS 4 LAKHS INSTANT CREDIT FOR SALARIED PEOPLE SS
Personal Loan: ఉద్యోగులకు రూ.4,00,000 వరకు లోన్... ఎలా తీసుకోవాలంటే
Personal Loan | ఉద్యోగులకు ఇన్స్టంట్ క్రెడిట్ లైన్ ప్రకటించింది డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ CASHe సంస్థ. రూ.10,000 నుంచి రూ.4,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. కరోనా వైరస్ సంక్షోభ కాలంలో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? వెంటనే లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? డిజిటల్ లెండింగ్ ప్లాట్‌ఫామ్ CASHe సంస్థ ఇన్స్టంట్ క్రెడిట్ అందిస్తోంది. రూ.10,000 నుంచి రూ.4,00,000 వరకు క్షణాల్లో రుణాలు ఇస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 5
2. యూజర్ ప్రొఫైల్‌ను బట్టి లోన్ లిమిట్ ఉంటుంది. యూజర్లకు మంజూరు చేసిన మొత్తంలో ఎంతైనా వాడుకోవచ్చు. కావాల్సిన లోన్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌కు ట్రాన్స్ఫర్ అవుతుంది. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 5
3. కస్టమర్లు నిర్ణీత కాలంలో వడ్డీతో సహా లోన్ తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. బయ్ నౌ పే లేటర్ ఆప్షన్ కూడా ఉంది. ఇందుకోసం CASHe సంస్థ అమెజాన్, మింత్రా, బిగ్ బాస్కెట్, ఫ్లిప్‌కార్ట్, ఊబెర్ లాంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 5
4. క్రెడిట్ కార్డ్ లిమిట్ వచ్చినట్టే కస్టమర్లకు లోన్ లిమిట్ వస్తుంది. అందులో అవసరం ఉన్నంత కస్టమర్లు వాడుకోవచ్చు. వాడుకున్న మొత్తానికి మాత్రమే వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. ఎక్కువ లోన్ వచ్చినా ఎంత వాడుకుంటే అంత మొత్తానికే వడ్డీ వర్తిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 5
5. లోన్ తీసుకున్న కస్టమర్లు ఏడాదిలోగా తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. యాప్ ద్వారా లోన్‌కు దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. కస్టమర్ క్రెడిట్ ప్రొఫైల్ చెక్ చేసి లోన్ మంజూరు చేస్తుంది ఈ సంస్థ. (ప్రతీకాత్మక చిత్రం)