3. ధంతేరాస్ సందర్భంగా రెండు రోజుల్లో 39 టన్నుల బంగారాన్ని అమ్మారు వ్యాపారులు అంటే. 39,000 కిలోల బంగారం అమ్ముడు పోయింది. ఈ మొత్తం విలువ రూ.19,500 కోట్లు ఉంటుందని ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ తెలిపింది. గతేడాది ధంతేరాస్‌తో పోలిస్తే ఈసారి 30 శాతం ఎక్కువగానే బంగారాన్ని కొన్నారు పసిడిప్రేమికులు. (ప్రతీకాత్మక చిత్రం)
4. ఇండియా బిలియన్ అండ్ జ్యువెలర్స్ అసోసియేషన్ లెక్కల ప్రకారం గతేడాది ధంతేరాస్ సందర్భంగా 30 టన్నులు అంటే 30,000 కిలోల బంగారం అమ్ముడుపోతే, ఈసారి 39 టన్నులు అంటే 39,000 కిలోల బంగారం అమ్మారు. సెంటిమెంట్‌తో కొందరు, పెట్టుబడి కోసం మరికొందరు బంగారం కొనేందుకు ఆసక్తి చూపించడం విశేషం. (ప్రతీకాత్మక చిత్రం)
5. ధంతేరాస్ రోజు హైదరాబాద్‌లో బంగారం ధరలు చూస్తే 22 క్యారెట్ గోల్డ్ ధర రూ.47,010 కాగా, 24 క్యారెట్ గోల్డ్ ధర రూ.51,290 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.63,200 దగ్గర ట్రేడ్ అయింది. అంతకన్నా ముందు తక్కువగా ఉన్న బంగారం, వెండి ధరలు ధంతేరాస్ సమీపించేకొద్దీ కాస్త పెరిగాయి. అయినా గోల్డ్, సిల్వర్ కొనేందుకు ఆసక్తి చూపించారు కస్టమర్లు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఈసారి ధంతేరాస్ రోజునే ఇండియా, పాకిస్తాన్ మధ్య టీ20 వాల్డ్ కప్ క్రికెట్ మ్యాచ్ జరిగింది. దీంతో అమ్మకాలు ఎలా ఉంటాయోనని వ్యాపారులు ఆందోళన చెందారు. మ్యాచ్ ముగిసిన తర్వాత కస్టమర్లు క్యూకట్టారని, షాపులు కిటకిటలాడాయని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెలరీ డొమెస్టిక్ కౌన్సిల్ ఛైర్మన్ ఆశిష్ పీటీఐకి తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)
7. కరోనా వైరస్ మహమ్మారితో రెండేళ్ల పాటు అన్ని రంగాల్లో అమ్మకాలు అంతంత మాత్రంగానే ఉన్నాయి. కానీ ఈసారి దీపావళి ఫెస్టివల్ బిజినెస్ రూ.1.5 లక్షల కోట్లు దాటినట్టు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ (CAIT) అంచనా వేస్తోంది. బంగారు నగలు మాత్రమే కాదు, ఇతర వస్తువుల్ని పోటీపడి కొన్నారు భారతీయులు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఆటోమొబైల్ రంగంలో రూ.6,000 కోట్ల వ్యాపారం జరగగా, రూ.1,500 కోట్ల ఫర్నీచర్, రూ.2,500 కోట్ల కంప్యూటర్లు, ఇతర పరికరాలు, రూ.3,000 కోట్ల ఎఫ్ఎంసీజీ ఉత్పత్తులు, రూ.1,000 కోట్ల ఎలక్ట్రానిక్ వస్తువులు, రూ.500 కోట్ల స్టెయిన్లెస్ స్టీల్, అల్యూమినియం, ఇత్తడి పాత్రలు కొన్నారని CAIT జాతీయ అధ్యక్షుడు బీసీ భార్తియా తెలిపారు. (ప్రతీకాత్మక చిత్రం)