9. ఉదాహరణకు మీరు ఇప్పుడు సావరిన్ గోల్డ్ బాండ్ ద్వారా 10 గ్రాములకు రూ.51,270 ఇన్వెస్ట్ చేశారనుకుందాం. రీడీమ్ లేదా మెచ్యూరిటీ సమయంలో బంగారం ధర రూ.75,000 ఉంటే అప్పుడు మీకు రూ.75,000 వస్తాయి. దీంతో పాటు అదనంగా ఏడాదికి 2.5 శాతం వడ్డీని కూడా పొందొచ్చు. మెచ్యూరిటీ వరకు ఆగకుండా గోల్డ్ బాండ్స్‌ని స్టాక్ మార్కెట్లో అమ్ముకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
10. మీరు సావరిన్ గోల్డ్ బాండ్స్‌ని ఏ బ్యాంకులో అయినా తీసుకోవచ్చు. పోస్ట్ ఆఫీసులు, ఎన్ఎస్ఈ, బీఎస్ఈ లాంటి సంస్థల్లో గోల్డ్ బాండ్స్ లభిస్తాయి. ఓ వ్యక్తి ఆర్థిక సంవత్సరంలో కనీసం 1 గ్రాము నుంచి గరిష్టంగా 500 గ్రాముల వరకు గోల్డ్ బాండ్స్ కొనొచ్చు. హిందూ అవిభాజ్య కుటుంబం గరిష్టంగా 4 కిలోల వరకు, ట్రస్టులు 20 కిలోల వరకు గోల్డ్ బాండ్స్ తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)