9. బిస్కెట్ల రూపంలో ఉండేది 24 క్యారెట్ బంగారం. ఆ బంగారాన్ని కొంటే మేకింగ్ ఛార్జీలంటూ ఏవీ ఉండవు. కానీ... 22 క్యారెట్ నగలు కొంటే మేకింగ్ ఛార్జీలు చెల్లించాలి. ఎందుకంటే బంగారం తూకాన్ని ఆ రోజు ధరకు లెక్కించి రేటు నిర్ణయిస్తారు. నగల తయారీకి అయ్యే ఖర్చును మేకింగ్ ఛార్జీల పేరుతో బిల్లులో వేస్తారు. (ప్రతీకాత్మక చిత్రం)
11. అక్షయ తృతీయ, ధంతేరాస్ లాంటి సందర్భాల్లో కస్టమర్లను ఆకర్షించేందుకు మజూరీ లేదు. మేకింగ్ ఛార్జీలు 0% అనే ప్రకటనలు ఎక్కువగా వినిపిస్తుంటాయి. ఇక్కడే తిరకాసేంటో గమనించాలి. ముడి బంగారంతో నగలు తయారు చేయడానికి ఎంతో కొంత మేకింగ్ ఛార్జీలు చెల్లించక తప్పదు. ఊరికే డబ్బులు తీసుకోకుండా ఎవరూ నగలు తయారు చేసి ఇవ్వరు. (ప్రతీకాత్మక చిత్రం)
12. అలాంటప్పుడు నగల షాపుల యజమానులు మేకింగ్ ఛార్జీలు లేకుండా నగలను అమ్మడం ఏలా సాధ్యం? ఇది అస్సలు సాధ్యం కాదు. అయితే మీరు నగలకు చెల్లించే రేటులోనే మేకింగ్ ఛార్జీలు కూడా కలిపే ఉంటాయి. కాకపోతే కస్టమర్లను ఆకర్షించేందుకు మేకింగ్ ఛార్జీలు లేవు అని ప్రకటనలు ఇస్తుంటారు నగల షాపుల యజమానులు. (ప్రతీకాత్మక చిత్రం)
17. హాల్‌మార్క్ బంగారు నగలు అనే పేరును మీరు వినే ఉంటారు. బంగారు ఆభరణాల షాపులు ఈ పేరుతో ప్రకటనలు కూడా ఇస్తుంటాయి. బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్-BIS సంస్థకు చెందిన గుర్తే హాల్‌మార్క్. ఈ గుర్తు ఉన్న నగలు నాణ్యమైనవి. వాస్తవానికి ప్రతీ నగల షాపు హాల్‌మార్క్ గుర్తు ఉన్న బంగారు నగలనే అమ్మాలి. (ప్రతీకాత్మక చిత్రం)
20. నగలు కొనేప్పుడు రాళ్లను కలిపి తూకం వేసి మోసం చేస్తుంటాయి షాపులు. రాళ్ల బరువు తీసేసి తూకం చేయమని గట్టిగా అడగండి. అవసరమైతే రాళ్లకు వేరుగా బిల్లు వేయమని అడగండి. మీరు కొన్న బంగారంలో తేడా ఉందని భవిష్యత్తులో అనిపిస్తే మీరు ఆ షాపుపైన కంప్లైంట్ కూడా చేయొచ్చు. లేదో కన్స్యూమర్స్ ఫోరమ్‌లో ఫిర్యాదు చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)