1. హీరో మోటోకార్ప్ మ్యాస్ట్రో జూమ్ (Maestro Xoom) స్కూటర్‌ను భారతీయ మార్కెట్లో లాంఛ్ చేసింది. ఇంట్రడక్టరీ ధర రూ.68,599. బుకింగ్స్ కొనసాగుతున్నాయి. ఈ టూవీలర్ మూడు వేరియంట్లలో లభిస్తుంది. LX (షీట్ డ్రమ్), VX (క్యాస్ట్ డ్రమ్), ZX (క్యాస్ట్ డ్రమ్) మోడల్స్‌లో కొనొచ్చు. ఇందులో అనేక ఫీచర్స్ మొదటిసారిగా ఉపయోగించినవి ఉన్నాయని కంపెనీ చెబుతోంది. (Photo: Mayank Gupta/ News18.com)
2. టాప్ వేరియంట్ అయిన జెడ్ఎక్స్ మోడల్లో హీరో ఇంటెలిజెంట్ కార్నరింగ్ లైట్స్ ఉన్నాయి. భారతదేశంలో 110సీసీ స్కూటర్‌కు లభిస్తున్న తొలి ఫీచర్ ఇది. హీరో ఇంటెలిజెంట్ కార్నరింగ్ లైట్స్ రైడర్ టర్న్ తీసుకుంటున్నప్పుడు చీకటిగా ఉండే మూలల్లో స్పష్టమైన కాంతిని అందిస్తుంది. ఇది సిగ్నేచర్ H స్థానంలో LED ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్, LED టెయిల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి. (Photo: Mayank Gupta/ News18.com)
3. హీరో మాస్ట్రో జూమ్ టూవీలర్లో డైమండ్ కట్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇవి సెగ్మెంట్లో అత్యుత్తమ 12-అంగుళాల టైర్లతో ఉంటాయి. 25 పైగా పేటెంట్ అప్లికేషన్స్‌తో అభివృద్ధి చేయడం విశేషం. డిజిటల్ స్పీడోమీటర్, కాల్స్ కోసం బ్లూటూత్ కనెక్టివిటీ, SMS అప్డేట్స్, లో ఫ్యూయెల్ ఇండికేటర్, రియల్ టైమ్ మైలేజ్, ఫోన్ బ్యాటరీ, సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్, బూట్ లైట్, ముందు గ్లోవ్ బాక్స్‌లో మొబైల్ ఛార్జర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. (Photo: Mayank Gupta/ News18.com)
5. హీరో జూమ్ ఐదు రంగుల్లో లభిస్తుంది. షీట్ డ్రమ్ వేరియంట్ పోల్‌స్టార్ బ్లూలో అందుబాటులో ఉండగా, కాస్ట్ డ్రమ్ వేరియంట్ పోలెస్టార్ బ్లూ, బ్లాక్, పెరల్ సిల్వర్ వైట్ కలర్స్‌లో లభిస్తుంది. కాస్ట్ డిస్క్ వేరియంట్ పోలెస్టార్ బ్లూ, బ్లాక్, స్పోర్ట్స్ రెడ్, మాట్ అబ్రాక్స్ ఆరెంజ్ కలర్ స్కీమ్‌లలో అందుబాటులో ఉంది. (Photo: Mayank Gupta/ News18.com)