1. డిసెంబర్ వచ్చేసింది. ఈ నెలతో ఈ ఏడాది ముగుస్తుంది. మీరు నవంబర్లో చేయలేకపోయిన బ్యాంకు లావాదేవీలను డిసెంబర్లో ప్లాన్ చేసుకున్నారా? అయితే డిసెంబర్లో సెలవుల గురించి తెలుసుకొని మీ ట్రాన్సాక్షన్స్ ప్లాన్ చేసుకుంటే మంచిది. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. డిసెంబర్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో బ్యాంకులు 7 రోజులు మూతపడనున్నాయి. ఇక హైదరాబాద్లో మాత్రం 8 రోజులు బ్యాంకులకు సెలవులు. తెలుగు రాష్ట్రాల్లో మిగతా ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్లో ఓ రోజు అదనంగా బ్యాంకులకు సెలవు ఉన్న విషయం దృష్టిలో పెట్టుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. డిసెంబర్ 1న గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్-GHMC ఎన్నికలు ఉన్నాయి. కాబట్టి ఆరోజున హైదరాబాద్కు సెలవు ప్రకటించింది తెలంగాణ ప్రభుత్వం. హైదరాబాద్లోని బ్యాంకులకు కూడా సెలవు ప్రకటించింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. డిసెంబర్ 1న జీహెచ్ఎంసీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్ పరిధిలోని బ్యాంకులకు మాత్రమే సెలవు. తెలుగు రాష్ట్రాల్లో మిగతా బ్రాంచులు పనిచేస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఇక డిసెంబర్ 6, డిసెంబర్ 13, డిసెంబర్ 20, డిసెంబర్ 27 తేదీల్లో ఆదివారం వచ్చింది. ఈ నాలుగు ఆదివారాలు బ్యాంకులకు సెలవులే. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఇక డిసెంబర్ 12 రెండో శనివారం, డిసెంబర్ 26 నాలుగో శనివారం సందర్భంగా బ్యాంకులు తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. డిసెంబర్లో క్రిస్మస్ పండుగ ఉంది. డిసెంబర్ 25న శుక్రవారం క్రిస్మస్ కావడంతో ఆరోజు బ్యాంకులకు సెలవే. డిసెంబర్ 26 నాలుగో శనివారం ఉంది కాబట్టి డిసెంబర్ 25 నుంచి 27 వరకు బ్యాంకులు తెరుచుకోవు. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. కేంద్ర ప్రభుత్వం ప్రకటించే సెలవులు ప్రభుత్వ బ్యాంకులతో ప్రైవేట్ సెక్టార్ బ్యాంకులకు వర్తిస్తాయన్న సంగతి కస్టమర్లు గుర్తుంచుకోవాలి. ఏడాదంతా బ్యాంకులకు సెలవుల వివరాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI అధికారిక వెబ్సైట్ https://www.rbi.org.in/ లో తెలుసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)