1. ఆర్థిక మాంద్యం ప్రభావంతో చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇప్పటికీ గ్లోబల్ టెక్ పరిశ్రమలో ఉద్యోగుల తొలగింపు కొనసాగుతోంది. ట్విట్టర్, ఫేస్బుక్ మాతృ సంస్థ మెటా, అమెజాన్ సహా చాలా కంపెనీలు వర్క్‌ఫోర్స్‌ను భారీగా తగ్గించుకునే ప్రణాళికలను ప్రకటించాయి. ఈ క్రమంలో టాప్ కంపెనీలు లేఆఫ్స్ ఇచ్చిన ఉద్యోగులకు అవకాశాలు ఇచ్చేందుకు కొన్ని కంపెనీలు ముందుకొస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. మొత్తంమీద మెటా, ట్విట్టర్, అమెజాన్ వంటి కంపెనీలలో ఉద్యోగాలు కోల్పోయిన ఉద్యోగులకు సపోర్ట్‌గా ఈ కంపెనీకి చెందిన 52.5 మిలియన్ డాలర్ల ఫండ్ నుంచి 5 మిలియన్ల (గరిష్టంగా 10 మిలియన్లు) డాలర్లను డే వన్ వెంచర్స్ కేటాయిస్తోంది. ఈ కంపెనీ వ్యవస్థాపకురాలు మాషా బుచెర్ రాజకీయవేత్తగా, రష్యాలో టీవీ రిపోర్టర్‌గా పని చేశారు. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఈ సంవత్సరం టెక్ లేఆఫ్స్ వల్ల ప్రభావితమైన వేలాది మంది ఉద్యోగుల్లో కనీసం 0.1% నుంచి 1% మంది ఎంటర్‌ప్రెన్యూర్స్ అవుతారని ఆమె చెప్పారు. తాను ప్రారంభించిన ప్రోగ్రామ్ ఛారిటీ కాదని, సీరియస్ బిజినెస్ అని బుచెర్ వివరించారు. సెలక్షన్ ప్రక్రియలో స్ట్రైప్, ట్విటర్లోని వ్యక్తులకు ఎటువంటి అదనపు ప్రాధాన్యత ఉండదన్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఇటీవల ఈకామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ సహా హై-ప్రొఫైల్ కంపెనీల్లో ఉద్యోగాల కోత వేగవంతమైంది. ఈ వారంలో 10,000 మంది వర్కర్స్‌ను తొలగించాలని అమెజాన్ యోచిస్తోంది. టెక్ దిగ్గజాలు, స్టార్టప్‌లు పొదుపు చర్యలను ప్రకటించాయి. ఆన్లైన్ చెల్లింపు సంస్థ స్ట్రైప్, కార్-హెయిలింగ్ యాప్ లిఫ్ట్ కూడా ఇటీవల పెద్ద మొత్తంలో ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ప్రకటించాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Lyft Inc, Meta Inc తమ వర్క్‌ఫోర్స్‌ను 10 శాతానికి పైగా తగ్గించుకున్నాయి. ఎలోన్ మస్క్ తాజాగా కొనుగోలు చేసిన ట్విట్టర్, ఈ నెల ప్రారంభంలో దాని 7,500 మంది ఉద్యోగులలో సగం మందిని తొలగించింది. కన్సల్టింగ్ సంస్థ ఛాలెంజర్, గ్రే & క్రిస్మస్ ఇంక్ ప్రకారం.. ఈ నెలలో ఇప్పటివరకు, టెక్నాలజీ కంపెనీలు 31,200 ఉద్యోగాలను తొలగించే ప్రణాళికలను రూపొందించాయి. (ప్రతీకాత్మక చిత్రం)