1. మీరు ప్రతీ నెలా రీఛార్జ్ చేయిస్తున్నారా? ఇలా ప్రతీ నెల రీఛార్జ్ చేయకుండా ఎక్కువ వేలిడిటీ ఉన్న ప్లాన్స్ కోసం చూస్తున్నారా? ఎయిర్టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా-Vi టెలికాం సంస్థలు 84 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ అందిస్తున్నాయి. సాధారణంగా 28 రోజులు, 56 రోజులు, 84 రోజులు, 365 రోజుల వేలిడిటీతో ప్లాన్స్ ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2. అయితే 84 రోజుల వేలిడిటీ ఉన్న ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే సుమారు 3 నెలల పాటు మళ్లీ రీఛార్జ్ గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు. ఈ ప్లాన్స్ రూ.600 లోపే ఉంటాయి. అంటే నెలకు సుమారు రూ.200 చొప్పున చెల్లిస్తే చాలు. మరి ఎయిర్టెల్, రిలయెన్స్ జియో, వొడాఫోన్ ఐడియా-Vi కస్టమర్లు ఏ ప్లాన్స్ రీఛార్జ్ చేస్తే బెటరో తెలుసుకోండి. (ప్రతీకాత్మక చిత్రం)
3. Jio Rs 555 plan: జియోలో రూ.555 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126జీబీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్కి కాల్ చేయడానికి 3000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
4. Jio Rs 599 plan: జియోలో రూ.599 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున 84 రోజులకు 168జీబీ డేటా ఉపయోగించొచ్చు. జియో నుంచి జియోకు అన్లిమిటెడ్ కాల్స్ చేసుకోవచ్చు. ఇతర నెట్వర్క్కి కాల్ చేయడానికి 3000 నిమిషాలు ఉంటాయి. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. జియో యాప్స్‌కి కాంప్లిమెంటరీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. Airtel Rs 379 plan: ఎయిర్‌టెల్‌లో రూ.379 ప్లాన్ రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. మొత్తం 6జీబీ డేటా, 900ఎస్ఎంఎస్లు లభిస్తాయి. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఉచితంగా ఆన్లైన్ కోర్సులు చేయొచ్చు. ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Airtel Rs 598 plan: ఎయిర్‌టెల్‌లో రూ.598 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున 84 రోజులకు 126జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఉచితంగా ఆన్లైన్ కోర్సులు చేయొచ్చు. ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7. Airtel Rs 698 plan: ఎయిర్‌టెల్‌లో రూ.698 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా చొప్పున ఉపయోగించొచ్చు. రోజూ 100 ఎస్ఎంఎస్లు వాడుకోవచ్చు. ఎయిర్టెల్ ఎక్స్‌స్ట్రీమ్ ప్రీమియం, వింక్ మ్యూజిక్ సబ్స్క్రిప్షన్ ఉచితం. ఫాస్ట్‌ట్యాగ్‌పై రూ.150 క్యాష్ బ్యాక్ లభిస్తుంది. ఉచితంగా ఆన్లైన్ కోర్సులు చేయొచ్చు. ఉచితంగా హెలో ట్యూన్స్ లభిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8. Vi Rs 599 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.599 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 1.5జీబీ డేటా చొప్పున ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్లో వాడుకోవచ్చు. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు. జొమాటో ఆర్డర్లపై రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
9. Vi Rs 699 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.699 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. ఇది డబుల్ డేటా ప్లాన్. రోజూ 2జీబీకి అదనంగా 2జీబీ కలిపి మొత్తం 4జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్లో వాడుకోవచ్చు. వీఐ యాప్ ద్వారా రీఛార్జ్ చేస్తే 5జీబీ డేటా అదనంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు. జొమాటో ఆర్డర్లపై రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
10. Vi Rs 795 plan: వొడాఫోన్ ఐడియాలో రూ.795 రీఛార్జ్ చేస్తే 84 రోజుల వేలిడిటీ లభిస్తుంది. రోజూ 2జీబీ డేటా ఉపయోగించొచ్చు. రోజూ 100ఎస్ఎంఎస్లు ఉచితం. ఈ ప్లాన్‌లో వీకెండ్ రోల్ ఓవర్ బెనిఫిట్ ఉంది. అంటే ఆ వారంలో ఉపయోగించని డేటాను వీకెండ్లో వాడుకోవచ్చు. జీ5 ప్రీమియం ఏడాది సబ్స్క్రిప్షన్ ఉచితంగా లభిస్తుంది. వీఐ మూవీస్ చూడొచ్చు. జొమాటో ఆర్డర్లపై రూ.75 డిస్కౌంట్ లభిస్తుంది. ఎంపీఎల్లో గేమ్స్ ఆడితే రూ.125 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)