డియర్నెస్ అలవెన్స్ లేదా డియర్నెస్ రిలీఫ్ పెంపు అనేది జనవరి 1 నుంచి అమలులోకి వస్తుంది. కాగా ప్రభుత్వం ఏడాదికి రెండు సార్లు డీఏ, డీఆర్ సవరిస్తుంది. జనవరి నుంచి జూన్ కాలానికి ఒకసారి, జూలై నుంచి డిసెంబర్ కాలానికి మరోసారి పెంపు ఉంటుంది. అందువల్ల కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు డియర్నెస్ అలవెన్స్ పెంచితే.. ఆ నిర్ణయం జనవరి 1 నుంచి అమలులోకి వస్తుందని గుర్తించుకోవాలి.