ప్రపంచంలో క్రిప్టో కరెన్సీ(Crypto Currency) ట్రెండ్(Trend) బాగా నడుస్తోంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం(Indian Government) కూడా క్రిప్టో కరెన్సీపై కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది. తాజాగా క్రిప్టో కరెన్సీని జీఎస్టీ(GST) కిందకు తీసుకురావడానికి కసరత్తులు చేస్తోంది. క్రిప్టోకరెన్సీని గూడ్స్ లేదా సర్వీస్ కింద వర్గీకరించాలని ప్రభుత్వం ప్లాన్ చేస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
దీని ద్వారా క్రిప్టో కరెన్సీ లావాదేవీలపై పన్ను విధించేందుకు అవకాశం ఏర్పడుతుంది. ప్రస్తుతానికి క్రిప్టో కరెన్సీ ఎక్స్ఛేంజీలను ఆర్థిక సేవలుగా పరిగణించి వాటిపై 18 శాతం జీఎస్టీ విధిస్తున్నారు. దేశంలో నడుస్తున్న లాటరీ, క్యాసినో, బెట్టింగ్, గుర్రపు పందెం, గ్యాంబ్లింగ్ల తరహాలోనే క్రిప్టోలను కూడా వర్గీకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. ప్రస్తుతం వీటిపై 28 శాతం జీఎస్టీ శ్లాబ్ నడుస్తోంది. ఇదే శ్లాబ్‌ను క్రిప్టోకరెన్సీ కు కూడా అమలు చేయనున్నారు. అయితే ప్రైవేటు క్రిప్టో ఆస్తులను నగదుగాను లేదా సెక్యూరిటీలుగాను గుర్తించనందున దాన్ని చట్టపరిధిలోకి ఏ విధంగా పరిగణలోకి తీసుకొస్తారనేది మరో ప్రశ్న. (ప్రతీకాత్మక చిత్రం)
ఈ విషయంపై మాట్లాడుతూ.. "క్రిప్టోకరెన్సీలపై జీఎస్టీ విధింపు విషయంలో స్పష్టత రావాల్సి ఉంది. మొత్తం లావాదేవీ విలువపై పన్ను విధించాలా? అనే విషయంపై కూడా ఓ నిర్ణయానికి రావాల్సి ఉంది. ఈ క్రమంలోనే క్రిప్టోలను వస్తువు లేదా సేవలుగా వర్గీకరించే విషయంపై కసరత్తు జరుగుతోంది" అని ఓ జీఎస్టీ అధికారి అన్నారు. ఇకపోతే క్రిప్టో కరెన్సీల నియంత్రణపై ఇప్పటి వరకు ఎలాంటి చట్టం లేకపోవడంతో అసలు దీన్ని యాక్షనబుల్ క్లెయిమ్‌గా పరిగణించాలా? లేదా? అనే విషయంపై కూడా పలు సందేహాలు ఉన్నాయి. ((ప్రతీకాత్మక చిత్రం)
తాజాగా విడుదల చేసిన బడ్జెట్లో క్రిప్టో ఆస్తులపై గరిష్ఠంగా 30 శాతం ఆదాయ పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇది ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. అలాగే ఒక ఏడాదిలో వర్చువల్ కరెన్సీ చెల్లింపులు రూ.10,000 దాటితే ఒక శాతం టీడీఎస్ కూడా విధించాలని ప్రభుత్వం బడ్జెట్లో ప్రతిపాదించింది. ఇలా గరిష్ఠంగా ఒక ఏడాదిలో రూ.50,000 వరకు టీడీఎస్‌ను వసూలు చేయనున్నారు. ఇవన్నీ ఏప్రిల్ 1 నుంచి అమలు కానున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థను అస్థిరతకు గురిచేస్తాయని, వాటిని కంట్రోల్ చేయడం అవసరమని భావించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఎక్కువ టాక్స్ పరిధిలోకి వీటిని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తోంది. ఈ విషయమై మాట్లాడుతూ.. "ఒకవేళ క్రిప్టో లావాదేవీల మొత్తంపై జీఎస్టీ విధించాల్సి వస్తే పన్ను రేటు 0.1 నుంచి 1 శాతం మధ్య ఉండే అవకాశం ఉంది. (ప్రతీకాత్మకచిత్రం)
ఏదేమైనప్పటికీ.. ఈ విషయంపై ఇంకా చర్చలు ప్రారంభ దశలోనే ఉన్నాయి. క్రిప్టోను ఎలా వర్గీకరించాలనే దానిపై చర్చలు ముమ్మరంగా సాగుతున్నాయి" అని ఓ జీఎస్టీ అధికారి తెలిపారు. ఏదైమైనా రానురాను క్రిప్టోలకు మరింత క్రేజ్ పెరిగి వాడకం కూడా పెరిగితే.. పరిణామాలు మారే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. దీంతోపాటు ప్రభుత్వం క్రిప్టో మాదిరి డిజిటల్ కరెన్సీని తీసుకురానున్నట్టు గతంలోనే పేర్కొంది. మరి ఈ కరెన్సీ.. క్రిప్టోని ఎలా ప్రభావితం చేస్తుందో చూడాలి. (ప్రతీకాత్మకచిత్రం)