హైదరాబాద్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 109.64 వద్ద ఉంది. డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 97.8 వద్ద కొనసాగుతోంది. విశాఖ పట్నంలో పెట్రోల్ కొనాలంటే లీటరుకు రూ. 110.46 చెల్లించుకోవాలి. అదే డీజిల్ రేటు అయితే లీటరుకు రూ. 98.25 వద్ద కొనసాగుతోంది. పెట్రోల్, డీజిల్ ధరలు ప్రాంతం ప్రాతిపదికన స్వల్పంగా మారొచ్చు.
కాగా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ప్రతి రోజూ పెట్రోల్, డీజిల్ ధరలను సమీక్షిస్తూ ఉంటాయి. అయితే పది నెలలుగా మాత్రం రేట్లలో ఎలాంటి మార్పు చేయడం లేదు. క్రూడ్ ధరలు భారీగా తగ్గినా కూడా ఫ్యూయెల్ రేట్లు అలానే ఉండటం గమనార్హం. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు తమ నష్టాలను తగ్గించుకునే పనిలో ఉన్నాయని, అందువల్ల ధరలు తగ్గకపోవచ్చనే అభిప్రాయాలు కూడా ఉన్నాయి.