ఎస్బీఐ కార్డు వెబ్సైట్ ప్రకారం చూస్తే.. అమెజాన్‌లో సింప్లీ క్లిక్, సింప్లీ క్లిక్ అడ్వాంటేజ్ ఎస్బీఐ కార్డు ద్వారా చేసే షాపింగ్‌పై లభించే అక్యూరల్ 10ఎక్స్ రివార్డు పాయింట్లు 5ఎక్స్‌కు తగ్గుతాయి. 2023 జనవరి 1 నుంచి ఈ నిర్ణయం అమలులోకి వస్తుంది. అయితే అపోలో, బుక్ మై షో, క్లియర్ ట్రిప్, ఈజీ డిన్నర్, లెన్స్ కార్ట్ , నెట్‌మెడ్స్ వంటి వాటిల్లో షాపింగ్ చేస్తే ఎప్పటిలాగే 10 ఎక్స్ రివార్డు పాయింట్లు పొందొచ్చు.