కస్టమర్ కోరకుండానే క్రెడిట్ కార్ట్ మంజూరు చేసినట్లు తెలిస్తే బిల్ చేసిన మొత్తానికి రెట్టింపు జరిమానాగా చెల్లించాల్సి ఉంటుందని రిజర్వ్ బ్యాంక్ గురువారం కార్డ్ సంస్థలను హెచ్చరించింది. కస్టమర్ల నుంచి బకాయిలను రికవరీ చేసే సమయంలో బెదిరింపులు, వేధింపులకు పాల్పడవద్దని కార్డ్ సంస్థలు, థర్డ్ పార్టీ ఏజెంట్లను కోరింది. (ప్రతీకాత్మక చిత్రం)
ప్రధాన ఆదేశాల ప్రకారం రూ.100 కోట్ల కంటే ఎక్కువ నికర విలువ కలిగిన వాణిజ్య బ్యాంకులు స్వతంత్రంగా లేదా ఇతర కార్డ్ జారీ చేసే బ్యాంకులు/NBFCల భాగస్వామ్యంతో క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని చేపట్టవచ్చు. ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRB) కూడా తమ స్పాన్సర్ బ్యాంక్ లేదా ఇతర బ్యాంకుల సహకారంతో క్రెడిట్ కార్డ్‌లను జారీ చేయడానికి అనుమతి పొందాయి. (ప్రతీకాత్మక చిత్రం)
ఆంబుడ్స్మన్ను సంప్రదించవచ్చు..
సెంట్రల్ బ్యాంక్ విడుదల చేసిన ఓ ప్రకటనలో.. ‘కోరకుండానే సదరు బ్యాంకు లేదా ఇతర సంస్థలు క్రెడిట్ కార్డు జారీ చేస్తే.. కస్టమర్ ఆర్బీఐ అంబుడ్స్‌మన్‌ను సంప్రదించవచ్చు. అంబుడ్స్‌మన్ పథకం నిబంధనల ప్రకారం.. అనుమతి లేకుండా కార్డ్ మంజూరు చేసినందుకు చెల్లించాల్సిన నష్టపరిహారం మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఫిర్యాదుదారుడి సమయం, చేసిన ఖర్చులు, అతను/ఆమె అనుభవించిన వేధింపులు , మానసిక వేదనను పరిగణనలోకి తీసుకుంటారు.’ అని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ(ఎన్బీఎఫ్సీ)లు ముందస్తు అనుమతి లేకుండా క్రెడిట్ కార్డ్ వ్యాపారాన్ని చేపట్టకూడదని ఆర్బీఐ తెలిపింది. రిజర్వ్ బ్యాంక్ నుంచి ముందస్తు అనుమతి పొందకుండా, NBFCలు డెబిట్ కార్డ్‌లు, క్రెడిట్ కార్డ్‌లు, ఛార్జ్ కార్డ్‌లను వర్చువల్‌గా లేదా భౌతికంగా జారీ చేయవని పేర్కొంది. కస్టమర్ల నుంచి బకాయిల రికవరీకి సంబంధించి, సంస్థలు, ఏజెంట్లు కోడ్‌కు కట్టుబడి ఉండేలా చూసుకోవాలని కోరింది. రుణ సేకరణ కోసం థర్డ్ పార్టీ ఏజెన్సీలను నియమించుకొనే సంస్థలు కస్టమర్ల ప్రతిష్టను దెబ్బతీసే చర్యలకు దూరంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. (ప్రతీకాత్మక చిత్రం)
కార్డ్ తీసుకోవాలని బలవంతం చేయకూడదు..
కార్డ్ జారీ చేసేవారు/వారి ఏజెంట్లు క్రెడిట్ కార్డ్ హోల్డర్ల కుటుంబ సభ్యుల గోప్యతకు భంగం కలిగించే, బహిరంగంగా అవమానపరిచే చర్యలకు పాల్పడకూడదని, రుణ సేకరణ ప్రయత్నాలలో ఏ వ్యక్తిపైనైనా మౌఖిక లేదా శారీరకంగా బెదిరింపులు లేదా వేధింపులకు పాల్పడకూడదని స్పష్టం చేసింది. డెబిట్ కార్డుల జారీకి సంబంధించి, బ్యాంకులు డెబిట్ కార్డ్ సదుపాయాన్ని పొందమని ఖాతాదారుని బలవంతం చేయకూడదని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)
కో-బ్రాండింగ్ భాగస్వామి సహ బ్రాండెడ్ కార్డ్‌ని తన సొంత ఉత్పత్తిగా ప్రచారం చేయకూడదని ఆర్బీఐ ఆదేశించింది. ఫిర్యాదుల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని, విస్తృతంగా ప్రచారం చేయాలని కార్డు జారీ చేసే సంస్థలకు సూచించింది. ఫిర్యాదుదారుడు ఫిర్యాదు చేసిన తేదీ నుండి గరిష్టంగా ఒక నెల వ్యవధిలో కార్డ్ ఇచ్చిన సంస్థ నుంచి సంతృప్తికరమైన సమాధానం అందకపోతే ఆర్బీఐ అంబుడ్స్‌మన్ కార్యాలయాన్ని సంప్రదించే అవకాశం ఉందని తెలిపింది. (ప్రతీకాత్మక చిత్రం)