1. RTGS: మనీ ట్రాన్స్ఫర్ చేయడానికి ఉన్న పద్ధతుల్లో రియల్ టైమ్ గ్రాస్ సెటిల్మెంట్-RTGS సిస్టమ్ ఒకటి. భారీగా లావాదేవీలు జరిపేవారికి ఆర్టీజీఎస్ ఉపయోగపడుతుంది. డిసెంబర్ నుంచి ఆర్టీజీఎస్ సేవలు కస్టమర్లకు 24 గంటలు అందుబాటులోకి వస్తాయని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-RBI ఇప్పటికే ప్రకటించింది. ప్రస్తుతం కస్టమర్లకు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఆర్టీజీఎస్ సేవలు లభిస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4. Saral Jeevan Bima: స్టాండర్డ్ ఇండివిజ్యువల్ టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని ఇన్స్యూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా-IRDAI ఇన్స్యూరెన్స్ కంపెనీలను ఆదేశించింది. 2021 జనవరి 1 నుంచి 'సరళ్ జీవన్ బీమా' పేరుతో టర్మ్ ఇన్స్యూరెన్స్ పాలసీని అందించాలని చెప్పింది. అయితే అంతలోపే పాలసీని రూపొందిస్తే ఐఆర్డీఏఐ ఆమోదం పొందిన తర్వాత కంపెనీలు పాలసీని అమ్మొచ్చు. అంటే డిసెంబర్లోనే 'సరళ్ జీవన్ బీమా' పాలసీ అందుబాటులోకి వచ్చే అవకాశముంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. IndiGo Airlines: ఇండిగో ఎయిర్లైన్స్ ఆంధ్రప్రదేశ్లో డిసెంబర్ 1 నుంచి రెండు ఫ్లైట్లను నడపనుంది. విశాఖపట్నం-విజయవాడ, విజయవాడ-తిరుపతి రూట్లలో ఈ ఫ్లైట్స్ నడుస్తాయి. విజయవాడలో మధ్యాహ్నం 1.45 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 2.50 గంటలకు విశాఖపట్నం చేసుకుంటుంది. విశాఖటప్నంలో మధ్యాహ్నం 3.15 గంటలకు ఫ్లైట్ బయల్దేరి విజయవాడకు సాయంత్రం 4.25 గంటలకు చేరుకుంటుంది. ఇక తిరుపతిలో మధ్యాహ్నం 12.05 గంటలకు ఫ్లైట్ బయల్దేరి మధ్యాహ్నం 1.20 గంటలకు విజయవాడకు చేరుకుంటుంది. విజయవాడలో సాయంత్రం 4.50 గంటలకు ఫ్లైట్ బయల్దేరి సాయంత్రం 6.20 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
7. LPG Cylinder Prices: ప్రతీ నెల మొదటి రోజు ఎల్పీజీ సిలిండర్ల ధరల్ని సవరిస్తుంటాయి ఆయిల్ కంపెనీలు. ఒకటో తేదీని ప్రకటించిన ధరలే ఆ నెలంతా అమలులో ఉంటాయి. డిసెంబర్ 1న గ్యాస్ సిలిండర్ల ధరలు తగ్గొచ్చు లేదా పెరగొచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ఆయిల్ ధరలపై గ్యాస్ సిలిండర్ల ధరలు ఆధార పడి ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)