Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
Personal Loans: గుడ్ న్యూస్... కస్టమర్లకు కోవిడ్ 19 లోన్స్ ఇస్తున్న బ్యాంకులు
Covid-19 Personal Loans | మీకు ఏదైనా బ్యాంకులో అకౌంట్ ఉందా? ప్రస్తుతం కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారా? కోవిడ్ 19 పేరుతో బ్యాంకులు ప్రత్యేకంగా లోన్స్ ఇస్తున్నాయి. పూర్తి వివరాలు తెలుసుకోండి.
1. బ్యాంకులో కొత్తగా కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ అందిస్తున్నాయి. కరోనా వైరస్ సంక్షోభం కారణంగా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నవారు, ఇప్పటికిప్పుడు డబ్బు అవసరం ఉన్నవారు ఈ రుణాలు తీసుకోవచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 8
2. పంజాబ్ నేషనల్ బ్యాంక్-PNB, బ్యాంక్ ఆఫ్ బరోడా-BoB, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర-BoM, బ్యాంక్ ఆఫ్ ఇండియా-BoI లాంటి బ్యాంకులు కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. వీటి వడ్డీ రేట్లు 15% వరకు ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 8
3. కరోనావైరస్ సంక్షోభం కారణంగా నగదు లేక కస్టమర్లు ఇబ్బందులు పడొద్దని బ్యాంకులు ఈ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. బ్యాంకుల నుంచి కోవిడ్ 19 పర్సనల్ లోన్ తీసుకోవాలంటే క్రెడిట్ స్కోర్ 650 పాయింట్లు ఉండాలి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 8
4. క్రెడిట్ స్కోర్ 650 కన్నా ఎక్కువ ఉన్నవాళ్లు రూ.3,00,000 నుంచి రూ.5,00,000 వరకు లోన్ తీసుకోవచ్చు. బ్యాంకులు తక్కువ మంది సిబ్బందితో నడుస్తున్నా ఈ రుణాలు మాత్రం వేగంగా ప్రాసెస్ అవుతున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 8
5. ఈ లోన్ల విషయంలో బ్యాంకులు కొన్ని నియమాలు పాటిస్తున్నాయి. తమ బ్యాంకులో సాలరీ అకౌంట్, హోమ్ లోన్, పర్సనల్ లోన్ ఉన్నవారికి కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్ తమ బ్యాంకులో సాలరీ తీసుకుంటున్నవారికి ఈ లోన్లు ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 8
6. ఈ బ్యాంకులో విలీనమైన యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ కస్టమర్లకూ ఇది వర్తిస్తుంది. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర తమ బ్యాంకులో హౌజింగ్ లోన్ ఉన్నవారికి కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఇస్తున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 8
7. బ్యాంక్ ఆఫ్ బరోడా తమ బ్యాంకులో హోమ్, కార్, పర్సనల్, ఎడ్యుకేషన్ లాంటి లోన్లు తీసుకున్నవారికి కోవిడ్ 19 పర్సనల్ లోన్స్ ఆఫర్ చేస్తున్నాయి. కనీసం ఆరు నెలలుగా తమ బ్యాంకు కస్టమర్‌గా ఉండాలన్న నియమాన్ని పెట్టుకున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 8
8. అయితే ప్రస్తుతం ఆర్థిక సంక్షోభం నెలకొన్న పరిస్థితుల్లో రుణాలు తీసుకోకపోవడమే మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు. సేవింగ్స్ ఏవైనా ఉంటే అందులోంచి ఖర్చు చేయడమే మంచిదంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)