ఇండోనేషియా తమ రిఫైన్డ్ పామ్ ఆయిల్ అయిన 'ఆర్బీడీ పామ్ ఓలైన్' ఎగుమతులపై బ్యాన్ విధించడంతో..ఆ ప్రభావం అన్ని దేశాలపైనా పడుతోంది. ముఖ్యంగా భారత్‌పై అధికంగా ఉంటుంది. ఇండోనేషియా నిర్ణయం వల్ల నూనె ధరలు మరో 10-15 శాతం మేర పెరిగే అవకాశముందని నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికే చాలా చోట్ల లీటర్ నూనె రేట్లు రూ.200-220కి పెరిగాయి. త్వరలోనే ఈ రేటు రూ.250ని తాకవచ్చనని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈనేపథ్యంలో చాలా మంది ముందుగానే నూనెను కొని స్టోర్ చేసి పెట్టుకుంటున్నారు. ఇక మరికొందరు దుకాణాదారులు ఇదే అదునుగా కృత్రిమ కొరత సృష్టించి.. బ్లాక్‌లో ఇంకా ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)