అలాగే ఫాల్ అలర్ట్ కూడా ఉంది. అంటే మీరు స్కూటర్ నుంచి పడిపోయినప్పుడు లేదంటే యాక్సిడెంట్ జరిగినప్పుడు ఎమర్జెన్సీ కంటాక్ట్స్కు మెసేజ్లు వెళ్లిపోతాయి. ప్రస్తుతం ఈ సేవలు కేవలం బెంగళూరులో మాత్రమే అందుబాటులో ఉన్నాయి. రానున్న కాలంలో ఇతర ప్రాంతాలకు కూడా ఈ సేవలను విస్తరించనున్నారు. ఇంకా బైక్స్ కన్వర్షన్ కూడా టెస్టింగ్ దశలో ఉందని కంపెనీ పేర్కొంటోంది.