కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ 2022-23 సంవత్సరానికి బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇందులో సిగరెట్లు, పొగాకు, పొగాకు ఆధారిత ఉత్పత్తుల మీద ఉన్న ట్యాక్స్‌ను పెంచారు. Photo from Pexels
2/ 7
మూడేళ్ళుగా పొగాకుపై సుంకాన్ని పెంచని ప్రభుత్వం ఈ సారి మాత్రం పెంచేసింది. సిగరెట్లపై కస్టమ్స్ డ్యూటీ పెరగనుండడంతో సిగరెట్ల ధరలు పెరగనున్నాయి. Photo from Pexels
3/ 7
సిగరెట్లపై కస్టమ్స్ సుంకాన్ని ఏకంగా 16 శాతం పెంచింది కేంద్రం. గత బడ్జెట్లలో పొగాకు మీద ఎలాంటి పన్ను ప్రస్తావనా లేకపోవడం..ఈసారి మాత్రం కస్టమ్స్ డ్యూటీ పెంచడంతో సిగరెట్ తయారీ కంపెనీల షేర్లు భారీగా పతనమయ్యాయి. Photo from Pexels
4/ 7
అటు సిగరెట్లపై నేషనల్ కెలామిటీ కంటింజెన్సీ డ్యూటీ పెంచిన కారణంగా గోల్డ్ ఫ్లేక్, సిల్క్ కట్ వంటి కంపెనీలు ధరలు పెంచక తప్పని పరిస్థితి ఏర్పడింది. Photo from Pexels
5/ 7
నిజానికి పొగాకుపై విధించే పన్ను, దాని ధరల నియంత్రణను GST కౌన్సిల్ చూసుకుంటుంది. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా జాతీయ విపత్తు ఆకస్మిక సుంకాన్ని-NCCD విధిస్తుంది. సిగరెట్లపై విధించే మొత్తం పన్నులో ఈ NCCD పన్ను వాటా 10శాతం ఉంటుంది. Photo from Pexels
6/ 7
వాస్తవానికి సిగరెట్లు ప్రస్తుతం తక్కువ ధరకేమీ లేవు. ధూమపానం ఇప్పుడు ఖరీదైన వాటిలో ఒకటి. ఇక తాజా కస్టమ్స్ డ్యూటీ పెంపుతో ఈ భారాన్ని సంబంధిత కంపెనీలు వినయోగదారులపైనే మోపుతాయి. Photo from Pexels
7/ 7
అటు సిగరెట్‌కు సుంకాన్ని పెంచడంపై పలువురు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనాపొగరాయుళ్ళ కాస్తైనా తాగడం తగ్గిస్తారని అభిప్రాయపడతారు. మరి చూడలి.. ధరలు పెరిగినందుకైనా సిగరెట్ మానేస్తారో లేక తమ ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటూనే ఉంటారో వెయిట్ అండ్ సీ. Photo from Pexels