China Investments: ప్రపంచంలోని ఏ దేశంలో ఏ వస్తువైనా... అది తాము తయారుచేసినదే అయి ఉండాలి అని చైనా 1990ల్లో డిసైడ్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే ప్రతీ వస్తువుకూ... నకలు (ఒకసారి వాడి పారేసేలా) వస్తువులను తయారుచేయడం మొదలుపెట్టింది. నాణ్యత లేకపోయినా... తక్కువ ధరకు లభిస్తున్నాయనే ఉద్దేశంతో... ప్రపంచ దేశాల ప్రజలు వాటిని వాడటం మొదలుపెట్టారు. అలా చైనా ప్రపంచ దేశాలపై తన ఆధిపత్యం ప్రదర్శించేందుకు కుట్రలు పన్నింది. ఐతే... ప్రస్తుతం ఇండియా దూసుకొస్తుంటే... డ్రాగన్ ఆటలు సాగట్లేదు. అందుకే... ఇప్పుడు బీజింగ్ కొత్త ఎత్తుగడలు వేస్తోంది. చైనా కంపెనీలతో ఇండియాలో పెట్టుబడులు పెట్టిస్తోంది. ఇది ఇండియాకి మంచి అంశమేనా... దీని వల్ల ఇబ్బందులు తలెత్తుతాయా అన్నది ఇప్పుడున్న ప్రశ్న. (ప్రతీకాత్మక చిత్రం)
కొంతకాలంగా చైనాతో మొండిగా ఉంటున్న భారత్... కాస్త జాలి తలచింది. సోమవారం 45 చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టేందుకు ఓకే చెప్పింది. దాంతో అక్కడి ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టబోతున్నాయి. మొత్తం 150 చైనా కంపెనీలు ఇండియాలో పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాయి. వాటి విలువ 2 బిలియన్ డాలర్ల (రూ.14,500 కోట్లు)... అవి వస్తే... ఇండియాలో వ్యాపారాలు మరింత పెరిగి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంతే కాదు... అమెరికా, జపాన్, హాంకాంగ్ నుంచి కూడా చాలా కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమవుతున్నాయి. దీనిపై కేంద్రం ఇంకా గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. తయారీ రంగంలో ఈ పెట్టుబడులు వచ్చే ఛాన్స్ ఉంది. అందువల్ల కేంద్రం త్వరలో వాటికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇస్తుందని అంటున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)
భద్రతకు ముప్పేనా?: ఒకప్పుడు ఈస్ట్ ఇండియా సంస్థ ఇలాగే వ్యాపారాల పేరుతో ఇండియాలో అడుగుపెట్టి... చివరకు ఇండియన్స్నే బానిసలుగా చేసుకుంది. ఇప్పుడు అలాంటి కుట్రలు చైనా చెయ్యకుండా ఇండియా జాగ్రత్త పడుతోంది. చైనా కంపెనీలు ఇండియాలోకి ఎంటరై... స్థానిక కంపెనీలపై గుత్తాధిపత్యం చెలాయించకుండా ఉండేలా కేంద్రం జాగ్రత్తగా వ్యవహరిస్తోంది. అందుకే వెంటనే అనుమతులు ఇవ్వట్లేదు. ఇది జాతి భద్రతకు చెందిన అంశంగా కేంద్రం భావిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
ఇప్పటికై చైనా ఉత్పత్తులు భారత మార్కెట్లను ముంచెత్తుతున్నాయి. గుండు సూది నుంచి మొబైల్స్ వరకూ వేల రకాల వస్తువులు చైనాకి చెందినవే ఇండియాలో అమ్ముడవుతున్నాయి. ఐతే... కేంద్రంలో తొలిసారి నరేంద్ర మోదీ సారధ్యంలో NDA ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... చైనాకి గట్టి దెబ్బలు తగులుతున్నాయి. మేకిన్ ఇండియా, మేడిన్ ఇండియా, ఆత్మనిర్భర భారత్, స్టార్టప్స్ వంటివి చైనాకి తలనొప్పిగా మారాయి. తమ వస్తువులకు ఇండియాలో క్రమంగా డిమాండ్ పడిపోతున్న విషయాన్ని గమనించిన చైనా... ఇండియాలో తమ కంపెనీలతో పెట్టుబడులు పెట్టించడం ద్వారా స్థానిక కంపెనీలకు గట్టి పోటీ ఇస్తూ... తమ ఉత్పత్తులు చైనావి కావనీ... ఇండియాలోనే తయారవుతున్నాయనే భావన కలిగేలా చేసే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే కేంద్రం కూడా అనుమతులు ఇచ్చే విషయంలో లోతుగా ఆలోచించి నిర్ణయం తీసుకుంటోంది. (ప్రతీకాత్మక చిత్రం)