2. ఈపీఎఫ్ అకౌంట్లో ఎన్ని డబ్బులు ఉన్నాయో తెలుసుకున్న తర్వాతే క్లెయిమ్‌కు దరఖాస్తు చేయడం మంచిది. ఈపీఎఫ్ అకౌంట్లో ఉన్న మొత్తం 75 శాతం లేదా మూడు నెలల బేసిక్ వేతనంలో ఏది తక్కువ అయితే అది డ్రా చేసుకునే అవకాశం ఉంది. మరి ఇది లెక్కించాలంటే మీ ఈపీఎఫ్ ఖాతాలో బ్యాలెన్స్ ఎంతో తెలుసుకోవాలి. (ప్రతీకాత్మక చిత్రం)
5. SMS: ఎస్ఎంఎస్ ద్వారా మీ పీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవాలంటే మీ యూఏఎన్ నెంబర్‌తో ఆధార్, పాన్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ లాంటి కేవైసీ వివరాలు అప్డేట్ చేయడం తప్పనిసరి. అప్పుడే మీరు ఎస్ఎంఎస్ ద్వారా పీఎప్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. EPFOHO UAN ENG అని టైప్ చేసి 7738299899 నెంబర్‌కు ఎస్ఎంఎస్ పంపాలి. ఈ వివరాలు తెలుగులో కావాలంటే EPFOHO UAN TEL అని టైప్ చేసి మెసేజ్ పంపాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. EPFO Portal: ముందుగా ఈపీఎఫ్ఓ అధికారిక వెబ్సైట్ https://www.epfindia.gov.in/ ఓపెన్ చేయాలి. Our Services ట్యాబ్‌లో for employees సెలెక్ట్ చేయాలి. Services ఆప్షన్లో Member passbook ఆప్షన్ సెలెక్ట్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అందులో UAN నెంబర్, పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈపీఎఫ్ పాస్‌బుక్ చూడొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఈ పద్ధతుల ద్వారా మీ ఈపీఎఫ్ బ్యాలెన్స్ తెలుసుకోవచ్చు. ఆ తర్వాత మీరు ఎంత డ్రా చేసుకునే అవకాశం ఉందో లెక్కించొచ్చు. అయితే ఈపీఎఫ్ అకౌంట్ నుంచి అత్యవసరమైతే తప్ప డబ్బులు డ్రా చేయకూడదు. ఈపీఎఫ్ అకౌంట్ నుంచి డబ్బులు తీసుకుంటే తప్ప మీ ఆర్థిక సమస్యలు తీరవనుకుంటేనే క్లెయిమ్‌కు అప్లై చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)