ప్రస్తుత ఉరుకుల పరుగుల జీవితంలో ఎవ్వరికీ తగినంత సమయం దొరకడం లేదు. చాలా మంది షాపింగ్ చేసే తీరిక కూడా లేక ఇ కామర్స్ వెబ్సైట్లను ఆశ్రయిస్తున్నారు. ఆన్లైన్లో ట్రైన్ టిక్కెట్ బుక్ చేసుకునే వారి సంఖ్య కూడా ఘణనీయంగా పెరిగింది. ఇప్పుడు ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) ప్రయాణికుల కోసం ట్రైన్ టిక్కెట్ ఆన్లైన్ బుకింగ్‌ను ఎంతో సౌకర్యవంతంగా చేసింది.
* ముందుగా అకౌంట్ ఓపెన్ చేయాలి : ఐఆర్సీటీసీలో ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేయాలంటే సంబంధిత వెబ్సైట్ లేదా యాప్‌లో అకౌంట్ ఉండాలి. ముందుగా www.irctc.co.in వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. అందులో ‘రిజిస్టర్’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత ‘ఇండివిడ్యువల్’ అనే దాన్ని ఎంచుకోవాలి. ఇప్పుడు ఓపెన్ అయిన పేజీలో మీ పేరు, పుట్టిన తేదీ, జెండర్, మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ, అడ్రస్ తదితర వివరాలను ఎంటర్ చేయాలి.
ఆ తర్వాత ఐఆర్సీటీసీ అకౌంట్‌కి సంబంధించి యూజర్ నేమ్, పాస్‌వర్డ్‌ను ఎంచుకోవాలి. అందులో అక్షరాలు, అంకెలు, స్పెషల్ క్యారెక్టర్లు ఉండేట్లు చూసుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ సెట్ చేస్తే అకౌంట్‌ను హ్యాక్ చేసే ప్రమాదం ఉండదు. పాస్వర్డ్ మరిచిపోతే గుర్తు చేసుకోడానికి సెక్యూరిటీ క్వశ్చన్ ఉంటుంది. ఆ ఖాళీలను కూడా పూర్తి చేయండి.
* టిక్కెట్ బుకింగ్ ఎలా? : అకౌంట్లోకి లాగిన్ అయిన తర్వాత హోం పేజీలో కనిపించే ఫ్రం, టు స్టేషన్ల దగ్గర మీ ప్రయాణ వివరాలు ఎంటర్ చేసి, తేదీని సెలక్ట్ చేసుకోండి. ప్రయాణం చేద్దామనుకుంటున్న తరగతి (1st Class Ac, 2nd Class Ac, 3rd Class Ac, General)లో ఖాళీల వివరాలు తెలుసుకునేందుకు ఈ ఆప్షన్లలో ఒకదాన్ని ఎంచుకోండి. ఆ తర్వాత ‘ఫైండ్ ట్రైన్స్’ అనే బటన్‌పై క్లిక్ చేయండి.
ఆయా రైల్వేస్టేషన్ల మధ్య ప్రయాణించే రైళ్ల వివరాలు కనిపిస్తాయి. అందులో టికెట్ ధర, టికెట్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోవాలి. ఇప్పుడు జనరల్, తత్కాల్, మహిళ, పీహెచ్ తదితర కోటాలు చూపిస్తాయి. అందులో ఒకదాన్ని సెలక్ట్ చేసుకోవాలి. ఒక పేజీ ఓపెన్ అవుతుంది. అందులో ప్రయాణికుడి పేరు, వయస్సు, ఇతర వివరాలు నమోదు చేసి బుకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
ఈసారి ‘మేక్ పేమెంట్’ ఆప్షన్ కనిపిస్తుంది. ఈ-వాలెట్, క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, నెట్ బ్యాంకింగ్ ఇతర యాప్‌ల ద్వారా పేమెంట్ చేయవచ్చు. చెల్లింపు చేసిన తర్వాత మీ మొబైల్‌కు టికెట్ కన్షర్మేషన్ మెసేజ్ వస్తుంది. అవసరం అనుకుంటే మీ ఐఆర్సీటీసీ అకౌంట్లో హిస్టరీ ఆప్షన్‌లోకి వెళ్లి టికెట్ ప్రింట్ కూడా తీసుకోవచ్చు.